Gold Rates: గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

Gold And Silver Rates Today 22

గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్. మగువలకు బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు.. శుక్రవారం మాత్రం ధరలు ఝలక్ ఇచ్చాయి. దీంతో పుత్తడి కొనాలంటేనే పసిడి ప్రియులు హడలెత్తిపోతున్నారు. ఈరోజు తులం గోల్డ్‌పై రూ. 710 పెరగగా.. కిలో వెండిపై రూ. 3,000 పెరిగింది.

ఇది కూడా చదవండి: Ram Madhav: యుద్ధ భూమి నుంచి తప్పుకుంటే ఏ పార్టీకి మనుగడ ఉండదు.. పీకేపై రామ్ మాధవ్ విసుర్లు

బులియన్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.710 పెరిగి రూ.1,28,460 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 650 పెరిగి రూ.1,17,750 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.530 పెరిగి రూ.96,340 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Bihar Video: నడిరోడ్డుపై ఆకతాయి స్టంట్లు.. హడలెత్తిపోయిన విద్యార్థినులు

ఇక వెండి ధర భారీ షాకిచ్చింది. 2లక్షలకు చేరువ దిశగా దూసుకుపోతుంది. కిలో వెండిపై రూ.3,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,76, 000 దగ్గర అమ్ముడవుతోంది. చెన్నై, హైదరాబాద్‌లో మాత్రం రూ.1,83,000 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.1,76, 000 దగ్గర అమ్ముడవుతోంది.