
Hyderabad: ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ నంటూ పలువురు యువతులకు ఎరేసిన కేటుగాడిని పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో యువతులను టార్గెట్ గా చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్న యువకుడిని పట్టుకున్నారు. ఆ యువకుడి పేరు మహమ్మద్ షాజాద్ గా గుర్తించారు. బీహార్, పాట్నా జిల్లా, పలిగంజ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ షాజాద్ ఆలం.. రెండేళ్ళ క్రితం హైదరాబాద్ కు వచ్చాడు. సోషల్ మీడియాలో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌నంటూ పలు ఫోటోలు, వీడియోలు పంచుకున్నాడు. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, వింగ్ కమాండర్ హోదా కలిగిన దుస్తులతో మహ్మద్ షాజాద్‌ఆలం నమ్మించే ప్రయత్నం చేశాడు. ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కేవలం యువతులకే ఎరా వేశాడు. నిందితుడి మాటలు విని పలువురు యువతులు డబ్బులు చెల్లించి మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కాగా.. ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించిన ఉద్యోగాలు మధ్యవర్తిత్వం ద్వారా ఆశించొద్దని, అది సాధ్యపడదని పోలీసులు తెలిపారు. ఈ రకమైన ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా పోస్టులు అధికారిక వెబ్‌సైట్‌లో చూడాలని పేర్కొన్నారు.
READ MORE: Story Board: పంచాయతీల్లో ఏకగ్రీవాల ఉద్దేశమేంటి ?..ఏకగ్రీవాలతో గ్రామాల్లో వచ్చిన మార్పులేంటి ?