
Hyderabad: కొడుకు, అల్లుడితో కలిసి భర్తను లేపేసింది ఓ భార్య.. మద్యం మత్తులో ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తన కొడుకు, అల్లుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధి బోడుప్పల్లో చోటు చేసుకుంది.. బోడుప్పల్ దేవేందర్ నగర్ ఫేజ్ – 2 కు చెందిన బండారి అంజయ్య స్థానికంగా స్కూల్ బస్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బాగా మద్యం తాగే అలవాటు ఉన్న అంజయ్య.. భార్య బుగ్గమ్మ, ముగ్గురు కొడుకులు, ఒక కూతురును మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడు. మద్యం తాగి కుటుంబసభ్యులను అంజయ్య తీవ్రంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ తన పెద్ద కొడుకు రాజు, అల్లుడు శేఖర్ లతో కలిసి భార్య బుగ్గమ్మ గత రాత్రి భర్త అంజయ్య గొంతుకు టవల్‌తో ఊపిరాడకుండా బిగించి చంపారు..
READ MORE: Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో కీలక పరిణామం.. నేడు సిద్ధరామయ్య, శివకుమార్ భేటీ..!
ఈ క్రమంలో అడ్డుకోబోయిన అంజయ్య కూతురు పూజను నిందితులు మరో రూంలో వేసి బయటికి రాకుండా బంధించారు.. ఈ హత్యకు సంబంధించిన విషయాలు మృతుడు మరో కొడుకు ఉదయ్ కిరణ్ కు సోదరి పూజ చెప్పడంతో 108 అంబులెన్స్ ను పిలవగా వారు చనిపోయాడని నిర్ధారించారు.. దీంతో మరో కొడుకు ఉదయ్ కిరణ్ తమ కుటుంబ సభ్యులపై మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు..
READ MORE: Maoist Leaders Surrender: మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ.. ఇద్దరు కీలక సభ్యులు లొంగుబాటు..