Hyderabad: వీడిన అంబర్‌పేట్ ఎస్సై తుపాకీ మిస్సింగ్ మిస్టరీ..

Amberpet Si Service Weapon Missing Mystery Solved Bhanu Prakash Betting Case

Hyderabad: అంబర్‌పేట్ ఎస్సై తుపాకీ మిస్టరీ వీడింది. తుపాకీ ఆచూకీ లభ్యమైంది.. ఇటీవల.. పోటీ పరీక్షల కోసం ఎస్సై భాను ప్రకాష్ విజయవాడకు వెళ్లాడు.. అక్కడ ఒక లాడ్జిలో వారం రోజులు పాటు బసచేశాడు. తనతో పాటు తుపాకీని తీసుకొని వెళ్లాడు. పోటీ పరీక్షలు రాసిన తర్వాత తుపాకీతో ఉన్న బ్యాగు కనిపించకుండా పోవడంతో హైరానా పడ్డాడు. లాడ్జీ సిబ్బందిని నిలదీసినప్పటికీ ప్రయోజనం శూన్యమైంది.. విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చి హైదరాబాద్‌కి చేరుకున్నాడు. భాను ప్రకాష్‌ని అదుపులోని తీసుకొని విచారించగా లాడ్జీలో మర్చిపోయినట్లు తెలిపాడు. దీంతో తుపాకీ కోసం రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విజయవాడకు పంపారు పోలీసులు.. మరోవైపు.. బెట్టింగులో భాను ప్రకాష్‌ కోటి 25 లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లు గుర్తించారు.

READ MORE: Pakistan: “ఇమ్రాన్ ఖాన్‌కి ఏమైంది..?” పాకిస్థాన్ పార్లమెంట్‌లో గందరగోళం..

ఇంతకీ ఏం జరిగింది..?
హైదరాబాద్ పోలీస్‌ శాఖకు మచ్చతెచ్చే విధంగా అంబర్‌పేట్ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐ భాను ప్రకాష్ ప్రవర్తించిన తీరు పెద్ద వివాదంగా మారింది. బెట్టింగ్‌లలో బాగా మునిగిపోయి అప్పుల పాలైన భాను ప్రకాష్, ఆర్థిక ఇబ్బందులు తీర్చుకునేందుకు చట్టవిరుద్ధ మార్గాలు ఎంచుకున్నట్టు బయటపడింది. ఓ రికవరీ కేసులో స్వాధీనం చేసిన ఐదు తులాల బంగారాన్ని తన సొంత ప్రయోజనాలకు వాడుకుని పోలీస్ వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీశాడు. బాధ్యతగా పని చేయాల్సిన స్థానంలో ఉండి నేరాలకు పాల్పడటంతో భాను ప్రకాష్‌పై పోలీసు శాఖలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంతేకాదు.. ఎస్సై గన్ మిస్ అయినట్లుగా తోటి సిబ్బంది, ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ అంశంపై ఉన్నతాధికారులు నిలదీశారు. కానీ.. రెండు రోజులుగా నిలదీసినా ఎస్సై భాను ప్రకాష్‌ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అయితే, బంగారంతో పాటు తుపాకీని కూడా ఓ బ్రోకర్ వద్ద తాకట్టు పెట్టినట్లు తొలుత అనుమానాలు వ్యక్తం అయ్యారు. మరింత లోతుగా దర్యాప్తు చేయగా.. తుపాకి ఆచూకీ ఎట్టకేలకు తెలిసింది.