
Hyderabad Cyber Fraud: అర్ధ రాత్రి వేళ ఇంట్లోకి చొరబడి అందినకాడికి దోచుకోవడం, అడ్డొస్తే హతమార్చి సొత్తు కాజేయడం ఒకప్పుడు నేరగాళ్ల పంథా. నగరంలో ఈ తరహా దోపిడీలు, దొంగతనాల స్థానంలో సైబర్ నేరాలు భారీగా పెరిగిపోవడం కలవరపెడుతోంది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో గత కొంతకాలంగా చోరీలు, ఇళ్లల్లో దొంగతనాల కేసుల్లో పెద్దగా పెరుగుదల కనిపించడం లేదు. ఇదే సమయంలో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా నమోదవుతోంది. తాజాగా హబ్సిగూడ చెందిన డెంటల్ డాక్టర్‌ను సైబర్ నేరగాళ్లు నిలువునా దోచేశారు. డాక్టర్ నుంచి 14 కోట్ల రూపాయల డబ్బులు కొట్టేశారు. అమ్మాయి పేరుతో వచ్చిన మెజేస్‌కు డాకర్ట్ స్పందించడమే ఈ దొపిడీకి ప్రధాన కారణం. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం..
READ MORE: Gold Rates: వామ్మో.. మగువలకు బిగ్ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన ఓ డెంటాల్ డాక్టరుకు ఫేస్‌బుక్‌లో ఒక మెసేజ్ వచ్చింది. మౌనిక అనే పేరుతో మెసెంజర్‌కి మెసేజ్ వచ్చింది. తాను కష్టాల్లో ఉన్నానని ఆదుకోమని మౌనిక రిక్వెస్ట్ పెట్టింది. మౌనిక రిక్వెస్ట్ ని ఆ వైద్యుడు యాక్సెప్ట్ చేశాడు. మాయమాటలు చెప్పి డాక్టర్‌ని బుట్టలో వేసుకుంది మౌనిక.. ఈ తరుణంలోనే విదేశాల్లో ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్‌లో పెట్టుబలు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించింది. క్రిప్టో కరెన్సీ పేరుతో ట్రేడింగ్ అకౌంటు ఓపెన్ చేయించింది. నిందితురాలు క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలను నిర్వహించింది.. డెంటల్ డాక్టర్‌కి పెద్ద మొత్తంలో లాభాలను చూపెట్టింది. డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే ట్యాక్స్ రూపంలో కొంత చెల్లించాలంటూ బుకాయించింది. ట్యాక్స్ రూపంలో మూడున్నర కోట్లు చెల్లించినప్పటికీ డబ్బులు తిరిగా రాలేదు. మొత్తం 91సార్లు డాక్టర్ నుంచి మౌనిక డబ్బులు తీసుకుంది. డబ్బులు తిరిగి రాకపోవడంతో టీఎస్ సైబర్ బ్యూరోని కాంటాక్ట్ చేశాడు ఆ వైద్యుడు. ప్రస్తుతం ఈ అంశంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
READ MORE: Andrea Jeremiah : న్యూడ్ పోస్టర్‌పై ఆండ్రియా జెరెమియా క్లారిటీ!