IBomma Ravi : ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి

Ibomma Ravi Custody Key Findings

IBomma Ravi : హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో మరోసారి కీలక వివరాలను వెలికితీశారు. పైరసీ వ్యవహారాన్ని పూర్తిగా తన అసలైన గుర్తింపుకి దూరంగా ఉంచాలని రవి ముందుగానే నిర్ణయించుకున్నట్లు విచారణలో స్పష్టం అయింది. ఇందుకోసం అతడు ‘ప్రహ్లాద్’ పేరుతో పూర్తిగా ఫేక్ ఐడెంటిటీని సృష్టించుకుని, ఆ పేరుతో వివిధ పత్రాలు, బ్యాంకింగ్ వ్యవస్థలు, కంపెనీ రిజిస్ట్రేషన్లను నిర్వహించాడు.

రవి ప్రహ్లాద్ పేరుతోనే పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడంతో పాటు, అనేక కంపెనీలు ఓపెన్ చేసి, అలాగే డొమెయిన్‌లు, బ్యాంక్ ఖాతాలు కూడా అదే పేరుతో నిర్వహించినట్టు పోలీసులు వెల్లడించారు. పైరసీ కార్యకలాపాలు ఎక్కడా తన ఒరిజినల్ ఐడెంటిటీకి కనెక్ట్ కాకుండా ఉండేందుకు ఈ పూర్తి వ్యవస్థను రూపొందించాడని విచారణలో తేలింది. ఇమంది రవి పైరసీ నెట్‌వర్క్‌ను నడిపించేందుకు 20 సర్వర్లు, 35 డొమెయిన్‌లు కొనుగోలు చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. దీంతో అతడు నిర్వహించిన పైరసీ వ్యూహం ఎంత పెద్ద స్థాయిలో నడుస్తోందో స్పష్టమవుతోంది. సినిమాల రికార్డింగ్, అప్‌లోడింగ్‌, డౌన్‌లోడింగ్‌ వంటి అక్రమ కార్యకలాపాలను ఈ నెట్‌వర్క్ ద్వారా నిర్వహించినట్టు ఆధారాలు బయటపడ్డాయి.

అంతేకాదు, రవి పంపిన పాత బెదిరింపు ఈమెయిల్స్ కూడా మరింత స్పష్టతనిస్తున్నాయి. ఫిలిం ఛాంబర్‌ , పోలీసులకు రెండు నెలల క్రితం పంపిన బెదిరింపు ఈమెయిల్, రవి వ్యక్తిగత ఈమెయిల్ ఐడీలోనే ఉన్నట్లు సైబర్ క్రైమ్ అధికారులు గుర్తించారు. దీంతో అతని పాత్రపై మరింత బలమైన ఆధారాలు లభించాయి. ఇంకా బెట్టింగ్‌ యాప్స్‌ , ఇతర ఆర్థిక లావాదేవీలపై కూడా అనుమానాలు ఉన్న నేపథ్యంలో, ఈ కోణంలో దర్యాప్తు కొనసాగించాలని సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. పైరసీకి మాత్రమే కాకుండా, ఇతర అక్రమ లావాదేవీలకు కూడా రవి సంబంధం ఉన్న అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఐబొమ్మ రవి కస్టడీ విచారణ కొనసాగుతున్న కొద్దీ, మరిన్ని సంచలన వివరాలు వెలుగులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Smriti and Palash: స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ ఒకే ఎమోజీ.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చినట్టేనా..?