
IND vs SA: టీమిండియా క్రికెట్ జట్టు దాదాపు 25 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయింది. కోల్‌కతా టెస్టులో 30 పరుగుల తేడాతో ఓడిపోయన భారత జట్టు, గువహటి టెస్టులో ఏకంగా 408 రన్స్ డిఫరెన్స్ తో పరాజయం పాలైంది. కాగా, నవంబర్ 30వ తేదీ నుంచి (ఆదివారం) సౌతాఫ్రికాతో 3 వన్డేల సిరీస్ స్టార్ట్ కానుంది. జార్ఖండ్ లోని రాంచీ వేదికగా మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. ఇక, ఈ మ్యాచ్ కి టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ రీ ఎంట్రీతో జట్టు బలంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత జట్టు, సఫారీపై వన్డే సిరీస్ గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Read Also: Australian PM Wedding: 62 ఏళ్ల వయసులో ప్రేమ వివాహం.. ప్రధాని జీవితంలో సరికొత్త అధ్యాయం..
అయితే, అనుభవజ్ఞులైన ఈ ఇద్దరు దిగ్గజాలు జట్టులోకి రావడంతో మొత్తం బ్యాటింగ్ లైన్‌అప్‌కు కొత్త ఉత్సాహం వచ్చినట్లైంది. రోహిత్ శర్మ ఓపెనింగ్ స్థానంలో పవర్‌ప్లే ఓవర్లలో దూకుడైన బ్యాటింగ్ తో సాలిడ్ స్టార్ట్‌ను అందిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అలాగే, స్పిన్ ని సమర్థవంతంగా ఎదుర్కొనే అతని నైపుణ్యం మిడిల్ ఓవర్లలో కీలకం కానుంది. మరోవైపు, విరాట్ కోహ్లీ వన్‌డౌన్ లో బ్యాటింగ్ కి రావడం జట్టు మిడిల్ ఆర్డర్ పై కాస్త ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే, సౌతాఫ్రికా బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కోనే శక్తి అతడికి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్, కోహ్లీ అనుభవం టీమిండియాకు ప్లస్ పాయింట్‌గా నిలవనుంది. ఈ ఇద్దరు ఆటగాళ్ల రాణిస్తే జట్టు సునాయసంగా విజయం సాధిస్తుంది అని అభిమానులు అనుకుంటున్నారు.