
గ్రామాలలో గ్రామపంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో తమ ఓటు అమ్మబడదు అంటూ గ్రామంలోని కొందరు యువకులు ఇంటి ఎదుట వినూత్నంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ లో గ్రామపంచాయతీ ఎన్నికల వేళ గ్రామంలోని యువత వారి ఇంటికి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు. ఫ్లెక్సీ పై ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, ఆ ఓటుని మేము అమ్ముకోమని, మా ఓటు విలువైనది – అమ్మబడదు అని వ్రాయించి పెట్టారు.
Disha Patani : జాలి, దయ లేని దిశా పాటని.. బ్లాక్ డ్రెస్ లో పరువాల విందు
ఇంటి ముందు నుండి వెళ్లే వారికి ఈ ఫ్లెక్సీలను చూస్తే ఓటు ఎంత విలువైందో అవగాహన కలుగుతుందని ఫ్లెక్సీ లను ఏర్పాటు చేశామని గ్రామంలోని యువకులు తెలిపారు. గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు ఎవరైనా డబ్బులు లేదా మద్యం ఇస్తే తమ కుటుంబ సభ్యులం తీసుకోమని తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఇస్తున్నారని తెలిస్తే వారిని కూడా అడ్డుకుంటామన్నారు. ఓటును అమ్ముకుంటే ప్రశ్నించే హక్కు కోల్పోతామని, రాబోయే ఐదు సంవత్సరాలు గ్రామ అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. విద్యావేత్తలు, రాజకీయ అనుభవం కలిగిన వారు, యువత కు గ్రామ సర్పంచ్ గా అవకాశం కల్పిస్తామన్నారు.
MLA Anirudh Reddy: తెలంగాణ వ్యాఖ్యలుపై పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి !