
iPhone 17 Price May Hike by RS 7000 in India: ప్రముఖ టెక్ దిగ్గజం ‘యాపిల్’ తన ఐఫోన్ 17 సిరీస్‌ను గత సెప్టెంబర్‌లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 17 సిరీస్‌కు ముందు నుంచి భారీ క్రేజ్ అందడంతో.. భారతదేశంలో అమ్మకాలు జోరుగా సాగాయి. ఇప్పటికీ ఐఫోన్ 17 అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే యాపిల్’ లవర్స్‌కు బిగ్ షాక్. నివేదికల ప్రకారం.. యాపిల్ కంపెనీ త్వరలో భారతదేశంలో ఐఫోన్ 17 ధరను పెంచవచ్చని తెలుస్తోంది. రూ.7,000 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మీరు ఐఫోన్ 17 కొనాలని ప్లాన్ చేస్తున్నట్లైతే.. త్వరగా కొనుగోలు చేయడం ఉత్తమం. ఎందుకంటే ధర ఎప్పుడైనా పెరగవచ్చు.
టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ ప్రకారం.. ఐఫోన్ 17 ధర త్వరలో రూ.89,990 కావచ్చు. ప్రస్తుతం ఐఫోన్ 17 ధర రూ.82,900గా ఉంది. అంటే ఏకంగా 7 వేలు పెరుగుందన్నమాట. ప్రస్తుతం ఐఫోన్ 17కు భారీ డిమాండ్ ఉంది. కానీ కంపెనీ వద్ద పరిమిత స్టాక్ మాత్రమే ఉంది. అధిక డిమాండ్, తక్కువ సరఫరా.. ధరల పెరుగుదలకు దారితీయవచ్చు. డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి క్షీణత కూడా ధరలను ప్రభావితం చేస్తుంది. ఈ కారణాలతో యాపిల్ కంపెనీ గతంలో ధరలను పెంచిన విషయం తెలిసిందే.
Also Read: IND vs SA Playing 11: భారత్‌దే బ్యాటింగ్.. రిషబ్ పంత్‌కు షాక్!
ఏఐ ఫీచర్లకు అవసరమైన మెమరీ, హార్డ్‌వేర్ ధర వేగంగా పెరుగుతోంది. కంపెనీలు ఈ ఖర్చులను స్వయంగా భరించాలి లేదా వినియోగదారులపై భారం మోపాల్సి ఉంటుంది. ఈ కారణాలతో ధరల పెరుగుదల దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈసారి యాపిల్ కంపెనీ బేస్ మోడల్ అయిన ఐఫోన్ 17లో కూడా మెరుగైన ఫీచర్స్ అందించింది. 256GB స్టొరేజ్, 120Hz ప్రోమోషన్ డిస్‌ప్లే, మెరుగైన కెమెరాలు, మరింత ప్రీమియం డిజైన్‌ను ఐఫోన్ 17 కలిగి ఉంది. ఐఫోన్ 17 ప్లస్ స్థానంలో సన్నని ఐఫోన్ ఎయిర్ మోడల్‌ను విడుదల చేసింది.