Jailer2 shooting : జైలర్ 2 షూటింగ్ లో ‘రజనీకాంత్’ రాక్.. నెల్సన్ షాక్

Jailer2 Shooting Spot Buzz Thalaivar Rocke Nelson Shock

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన జైలర్ ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం జైలర్ కు సీక్వెల్ గా  జైలర్ 2 ను తెరకెక్కిస్తున్నాడు నెల్సన్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమా సెట్లో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన పని యూనిట్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. రజనీకాంత్ వయసును మించి చూపిన ఎనర్జీ మరియు డెడికేషన్ యూనిట్ మొత్తాన్ని    మెస్మరైజ్ చేసింది.

Also Read : Akhanda 2 : అఖండ – 2 ప్రీమియర్స్.. టికెట్ హైక్స్.. వెరీ రిజనబుల్

వివరాలలోకెళితే సినిమాలో ఒక కీలక యాక్షన్ సీన్ కోసం సూపర్ స్టార్ బాగా బరువు ఉండే పరికరాన్ని ఎత్తి, దాన్ని పూర్తిగా తిప్పి, తలక్రిందులుగా ఉంచాల్సిన సన్నివేశం ఉందట. అది చాలా బరువు ఉండడంతో ఈ యాక్షన్ సీన్ రిస్క్ తో కూడుకున్నది కావడంతో  దర్శకుడు నెల్సన్ ముందుగా రజనీతో క్లోజ్‌అప్ షాట్స్ తీసి మిగతా షాట్ ను రజనీ డూప్‌తో చేయాలనే ప్లాన్ చేశాడట.  అయితే మరుసటి రోజు షూటింగ్ కు వచ్చిన తలైవర్ రజనీకాంత్ మొత్తం యాక్షన్ సీక్వెన్స్‌ ను ఎటువంటి డూప్ సాయం లేకుండా సింగిల్ షాట్ లో ఫినిష్ చేశాడట. అంతటి రిస్కీ యాక్షన్ ఎపిసోడ్ ను క్షణాల్లో పూర్తిచేసి యూనిట్ మొత్తాన్ని అవాక్కయ్యేలా చేశాడట రజిని. ఈ వయస్సులో సూపర్ స్టార్ స్టామినా యాక్షన్‌పై ఉన్న కంట్రోల్ చూసి టీమ్  షాక్ అయ్యారని తెలుస్తోంది. ముఖ్యంగా దర్శకుడు నెల్సన్ సూపర్ స్టార్ కు సినిమా పట్ల ఉండే డెడికేషన్ చూసి షాక్ అయ్యాడట. దర్శకుడు షాట్ ఫినిష్ చేసాక రజనీ చేసిన యాక్షన్ కు కేరింతలతో హోరెత్తించారు. దట్ ఈజ్ తలైవర్.