
Jihad Controversy: భారతదేశంలో మైనారిటీల రాజ్యాంగ హక్కులను కాపాడడంలో న్యాయవ్యవస్థ విఫలమైందని జమియత్ ఉలేమా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా మహమూద్ మదానీ ఆరోపించారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. అణచివేత ఉంటే, జిహాద్ ఉంటుందని అనే వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే, మదానీ వ్యాఖ్యలు ముస్లింలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, రాజ్యాంగ సంస్థలను సవాలు చేస్తున్నాయని బీజేపీ మండిపడింది.
Read Also: Pak vs Sri Lanka: పాక్-శ్రీలంక మ్యాచ్‌లో గందరగోళం.. అంపైర్‌తో పాకిస్థాన్ ఆటగాళ్ల గొడవ(వీడియో)..
న్యాయవ్యవస్థపై మదానీ విమర్శలు
బాబ్రీ మసీదు, ట్రిపుల్ తలాక్ కేసులతో సహా ఇటీవలి కోర్టు తీర్పులను చూస్తుంటే న్యాయవ్యవస్థపై ప్రభుత్వ ఒత్తిడి ఉంది అనే విషయం స్పష్టంగా కనిపిస్తుందని జమియత్ ఉలేమా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా మహమూద్ మదానీ ఆరోపించారు. రాజ్యాంగం హామీ ఇచ్చిన మైనారిటీల హక్కులను బహిరంగంగా ఉల్లంఘించే అనేక తీర్పులు ఇటీవల కాలంలో వచ్చాయన్నారు. 1991 నాటి ‘ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్’ ఉన్నప్పటికీ కేసులు ముందుకు సాగడం లేదన్నారు. రాజ్యాంగం అక్కడ రక్షించబడినంత కాలం మాత్రమే సుప్రీంకోర్టు ‘సుప్రీం’ అని పిలవడానికి అర్హతను కలిగి ఉంటుంది.. ఇది జరగకపోతే, దానికి సుప్రీం అని పిలవడానికి అర్హత లేదని జమియత్ మదానీ అన్నారు.
Read Also: Pak vs Sri Lanka: పాక్-శ్రీలంక మ్యాచ్‌లో గందరగోళం.. అంపైర్‌తో పాకిస్థాన్ ఆటగాళ్ల గొడవ(వీడియో)..
జిహాద్ నిర్వచనంపై అభ్యంతరం
జిహాద్‌ను ప్రజా చర్చల్లో చిత్రీకరిస్తున్న తీరుపై జమియత్ అధ్యక్షుడు మదానీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మీడియా, ప్రభుత్వం ఒక పవిత్రమైన భావనను వక్రీకరిస్తున్నాయన్నారు. “లవ్ జిహాద్,” “స్పిట్ జిహాద్,” “ల్యాండ్ జిహాద్” లాంటి లేబుల్స్ అసలు అర్థాన్ని తప్పుగా చూపుతున్నాయని విమర్శలు గుప్పించారు. జిహాద్ అంటే పవిత్రంగా ఉండేది, కానీ, ప్రస్తుతం పవిత్రంగా చూపిస్తున్నారని పేర్కొన్నారు. మత గ్రంథాలలో జిహాద్ కేవలం ఇతరుల మంచి కోసం మాత్రమే ప్రస్తావించబడిందని చెప్పుకొచ్చారు. అణచివేత ఎక్కడ ఉంటే, అక్కడ జిహాద్ ఉంటుంది అని పేర్కొన్నారు. అయితే, భారతదేశ లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ హింసాత్మక వివరణకు తావు ఇవ్వదని, ముస్లింలు రాజ్యాంగానికి విధేయత చూపుతారు.. పౌరుల హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వం అలా చేయకపోతే ఎలా అని మౌలానా మహమూద్ మదానీ ప్రశ్నించారు.