kalvakuntla Kavitha: జాగృతి అధ్యక్షురాలు కవిత అరెస్ట్..

K Kavitha Arrested Bc 42 Percent Reservation Protest Kamareddy

Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రస్తుతం కామారెడ్డిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డిలో కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రైలు రోకో నిర్వహించారు. ఆమెతో పాటు తెలంగాణ జాగృతి నాయకులు రైలు పట్టాలపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల కవితను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. అనంతరం వారు ట్రాక్‌పై కూర్చొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు అప్రమత్తమైన కామారెడ్డి పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందితో కలిసి జాగృతి నేతలను అక్కడ నుంచి తప్పించే ప్రయత్నం చేస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో కవితను అరెస్ట్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేవలం 17 శాతం రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లడం దారుణమన్నారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కాంగ్రెస్, బీజేపీలు అడ్డుకుంటూ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.

READ MORE: Telangana Eagle Team: “శభాష్” తెలంగాణ ఈగల్ టీం.. ఢిల్లీలో డ్రగ్స్ సరఫరా దందా గుట్టురట్టు..