Khaleda Zia: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని పరిస్థితి విషమం.

Bangladesh Ex Pm Khaleda Zias Health Extremely Critical Says Bnp

Khaleda Zia: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) చీఫ్ ఖలీదా జియా(80) ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. ఆమె ఛాతీ ఇన్ఫెక్షన్ గుండె, ఊపిరితిత్తులకు వ్యాపించడంతో ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఆమె పరిస్థితి చాలా విషమంగా మారిందని ఆమె సన్నిహిత సహాయకుడు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు చెప్పినట్లు బీఎన్పీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం అలంగీర్ చెప్పినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.

Read Also: Indus Valley Civilisation: సింధు లోయ నాగరికత ఎలా మాయమైంది.? ఐఐటీ సైంటిస్టుల పరిశోధన..

జియా చాలా కాలంగా కాలేయం, మూత్రపిండాల సమస్యలు, మధుమేహం, అర్థరైటిస్‌, కంటి సంబంధిత వ్యాధులతో సహా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె పెద్ద కుమారుడు తారిఖ్ రెహమాన్ బీఎన్పీ యాక్టింగ్ చైర్మన్‌గా ఉన్నారు. 2008 నుంచి లండన్‌లో నివసిస్తున్నారు. షేక్ హసీనా గతేడాది ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చింది. ఆ తర్వాత నుంచి బంగ్లాదేశ్‌లో బీఎన్పీ మళ్లీ క్రియాశీలకంగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలో ఖలీదా జియా వైద్యం కోసం లండన్ వెళ్లి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరింది.