
KL Rahul: టీమిండియా – దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ ముగిసింది. ఇప్పుడు వన్డే సిరీస్ వంతు వచ్చింది. ఇదే టైంలో ఫార్మాట్ మారిపోయింది, మైదానంలో కొంతమంది ఆటగాళ్లు కూడా మారిపోతున్నారు. ఈ ఫార్మాట్‌లోకి ఇద్దరు కీలక ఆటగాళ్లు తిరిగి వచ్చారు. వాళ్లిద్దరూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. అలాగే మరికొందరు ఆటగాళ్లు కూడా జట్టులో చేరారు. శుభ్‌మాన్ గిల్ గాయం కారణంగా ఈ వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈసందర్భంగా ఆయన ప్లేయింగ్ ఎలెవన్ గురించి కొన్ని ముఖ్యమైన ప్రకటనలు చేశాడు.
READ ALSO: Nuzvid: ప్రేమ జంట కోసం స్టేషన్ తలుపులు మూసివేసిన పోలీసులు.. బయటేమో రచ్చ!
ఈ వన్డే సిరీస్ నవంబర్ 30 ఆదివారం రాంచీలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా శనివారం కెప్టెన్ కేఎల్ రాహుల్ మీడియాతో మాట్లాడారు. ఈ సిరీస్ అంతటా తాను మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తానని రాహుల్ స్పష్టం చేశాడు. “నేను ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాను” అని ఆయన వెల్లడించాడు. రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్‌ల స్థానాలపై ఆయన మాట్లాడుతూ.. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత పంత్ జట్టులోకి తిరిగి రాగా, గైక్వాడ్ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఈ ఫార్మాట్‌లోకి అడుగు పెడుతున్నాడు. కానీ వారిద్దరిలో తుది జట్టులోకి ఎవరు అడుగుపెడుతున్నారని అడిగితే.. పంత్ గురించి రాహుల్ మాట్లాడుతూ.. “పంత్ ప్రతిభ గురించి అందరికీ తెలుసు. అతను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేరితే బ్యాట్స్‌మన్‌గా మాత్రమే కాకుండా, వికెట్ కీపింగ్ కూడా నిర్వహించేవాడు అవుతాడు” అని అన్నారు. రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం ఇవ్వడం గురించి అడిగినప్పుడు, రాంచీ వన్డేలో ఈ ప్లేయర్ ఆడతాడో లేదో చెప్పలేదు, కానీ ఈ సిరీస్ లో గైక్వాడ్‌కు కచ్చితంగా అవకాశం లభిస్తుందని అన్నారు. “రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఆటగాడు. తనకు వచ్చిన కొన్ని అవకాశాలలో అతను అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ఈ సిరీస్ లో అతనికి అవకాశం వస్తుంది” అని రాహుల్ వెల్లడించారు.
READ ALSO: Mana Shankar Varaprasad Garu OTT Rights: ఆ ఓటీటీలోనే మన శంకర్ వరప్రసాద్‌గారు స్ట్రీమింగ్..