Kohli- Dhoni: ఓటమి తర్వాత ధోని ఇంటికి టీమిండియా ప్లేయర్లు.. ‘కెప్టెన్ కూల్’- కోహ్లీ వీడియో వైరల్..

Virat Kohli Visits Ms Dhoni Ranchi Home Ahead Of India Vs South Africa Odi Series

Virat Kohli MS Dhoni in Ranchi: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ మరోసారి అభిమానుల్లో ఉత్సాహాన్ని రేపాడు. దక్షిణాఫ్రికాతో మొదటి వన్డేకు సిద్ధమవుతున్న సమయంలో గురువారం సాయంత్రం కోహ్లీ రాంచీలోని మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ నివాసానికి చేరుకోవడం క్రికెట్‌ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. కోహ్లీ కారు ధోనీ ఇంటి గేటు దాటుతుండగా బయట భారీగా చేరుకున్న అభిమానులు ఒక్కసారిగా హోరెత్తిపోయారు. మొబైల్‌ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసేందుకు తహతహలాడారు. ధోనీ కారు డ్రైవ్‌ చేస్తుండగా పక్క సీటు‌లో కోహ్లీ రిలాక్స్‌గా కూర్చున్న వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలోనే కోహ్లీ, ధోనీ భేటీ క్రికెట్‌ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. కోహ్లీతో పాటు రిషబ్‌ పంత్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ కూడా ధోనీని కలిసి కొంతసేపు ఆయనతో గడిపారు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కి ముందు భారత క్రికెటర్లు ధోని నివాసానికి వరుస కట్టడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవలి టెస్ట్ సిరీస్ ఓటమి తరువాత.. ధోనిని కలవడం గమనార్హం.

READ MORE: Tollywood : ‘స్టార్ పవర్ కాదు స్టోరీ యే పవర్’ అని నిరూపించిన చిన్న సినిమాలు

మరోవైపు.. కోహ్లీకి ఇది కీలకమైన సిరీస్‌గా మారనుంది. గత సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమై, మూడవ వన్డేలో అరవై పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చాడు. రోహిత్‌ శర్మ కూడా మంచి ఫామ్‌లో ఉండటంతో, ఈ సౌతాఫ్రికా సిరీస్‌ భారత జట్టుకు కీలకంగా మారనుంది. రోహిత్‌ శర్మతో కలిసి కోహ్లీ నెట్స్‌లో ప్రాక్టీస్‌ సెషన్‌ కి చెందిన మరో వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టెస్ట్‌ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న రోహిత్, కోహ్లీ ఇప్పుడు రాబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో తిరిగి రానున్నారు. ఆస్ట్రేలియా సిరీస్‌ తర్వాత ఈ ఇద్దరు సీనియర్‌ బ్యాటర్లు వన్డేలకు తిరిగి వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్‌లో భారత్ మొదటి 2 మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఫలితంగా సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయింది. అనంతరం.. రోహిత్, విరాట్ చివరి ODIలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నారు. తాజాగా టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత భారత జట్టు గణనీయమైన ఒత్తిడిని ఎదుర్కుంటుంది. కానీ రోహిత్, విరాట్ తిరిగి రావడంతో టీమిండియాకు కొత్త ఉత్సాహం రానుందని అభిమానులు భావిస్తున్నారు.

READ MORE: Tollywood : ‘స్టార్ పవర్ కాదు స్టోరీ యే పవర్’ అని నిరూపించిన చిన్న సినిమాలు

కాగా.. సొంతగడ్డపై భారత్ ఘోర పరాజయంను చవిచూసింది. దక్షిణాఫ్రికాతో గువాహటిలో జరిగిన రెండో టెస్టులో ఏకంగా 408 పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 140 పరుగులకే ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా (54) టాప్ స్కోరర్. టాప్ బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో సైమన్ హార్మర్‌ 6 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు. కేశవ్ మహారాజ్‌ 2 వికెట్లు పడగొట్టగా.. ముత్తుస్వామి, మార్కో యాన్సన్‌ చెరో వికెట్‌ తీశారు. ఈ ఓటమితో టీమిండియా టెస్ట్ సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది. గత నవంబరులో సొంతగడ్డపై న్యూజిలాండ్‌ చేతిలో భారత్ వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోని ఇంటికి టీమిండియా ప్లేయర్లు రావడంపై ఆసక్తి నెలకొంది.