
తెలంగాణలో జరుగుతున్న రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి మాజీ మావోయిస్టు నేత జ్యోతి బరిలోకి దిగుతున్నారు. మావోయిస్టు పార్టీలో 19 సంవత్సరాలుగా పనిచేసి ప్రజా సమస్యల పోరాటానికి కృషి చేశానని, 2023 సంవత్సరంలో సంవత్సరంలో లొంగిపోయిన అనంతరం, గ్రామంలో ప్రజల సమస్యలపై దృష్టి సాధించినట్లు తెలిపారు. మూడేళ్ల క్రితం లొంగి పోయిన మాజీ మావోయిస్టు నేరెళ్ల జ్యోతి సర్పంచిగా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా శివంగలపల్లికి చెందిన నేరెళ్ల జ్యోతి 2005లో దళ సభ్యురాలిగా చేరారు.
Spirit : ‘స్పిరిట్’ లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఫిక్స్ ?
కోనరావుపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠ శాలలో 2001లో పదో తరగతి చదివిన జ్యోతి.. 19 ఏళ్ల ప్రస్థానంలో జిల్లా కమిటీ సభ్యురాలి స్థాయికి చేరారు. రాష్ట్ర ప్రెస్ ఇన్ ఛార్జిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 2023లో అనారోగ్య కారణాలతో కరీంనగర్ ఎస్పీ సుబ్బారాయుడు ముందు లొంగిపోయారు. ప్రస్తుతం గ్రామంలోనే ఉంటున్న జ్యోతి పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో శివంగలపల్లి సర్పంచ్ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించారు. ప్రజాసేవ చేసే అవకాశం కోసం సర్పంచి పోటీలో నిల బడినట్లు జ్యోతి తెలిపారు.
Spirit : స్పిరిట్ కోసం.. ప్రభాస్ విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్న సందీప్ రెడ్డి వంగా