
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా నేటితో (నవంబర్ 29) మొదటి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. తొలి రోజే సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు అభ్యర్థుల నుంచి భారీ స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు సర్పంచి పదవుల కోసం 3,242 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 1,821 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
Also Read:Putin India Visit: ‘‘చమురు, S-400, Su-57 జెట్స్ ’’.. పుతిన్ పర్యటనలో కీలక అంశాలు..
రెండో రోజు సర్పంచ్ స్థానాలకు 4901 నామినేషన్లు దాఖలు. రెండో రోజు వార్డు మెంబర్ల స్థానాలకు 9643 నామినేషన్లు దాఖలు అయినట్లు తెలిపారు. రెండు రోజుల్లో సర్పంచ్ స్థానాలకు 8198 నామినేషన్లు, 11502 వార్డు మెంబర్ నామినేషన్లు దాఖలు అయినట్లు వెల్లడించారు. మొదటి విడతలో 189 మండలాల్లోని 4,236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించనున్నది.
30వ తేదీన నామినేషన్ పత్రాల పరిశీలన చేపడతారు. డిసెంబర్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అదే రోజు పోటీలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే, అదే రోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపట్టి వార్డు సభ్యులు, సర్పంచుల ఫలితాలను వెల్లడిస్తారు.