
Minister Nadendla: బాపట్ల జిల్లాలోని చెరుకు పల్లె మండలం నడింపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంది.. ప్రతి వరి గింజ బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పుకొచ్చారు. వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టిస్తుంది.. రాష్ట్రంలో 51 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.. ఇప్పటికే 11 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశాం.. ఇప్పటి వరకు 2 వేల300 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామని మత్రి నాదెండ్ల తెలిపారు.
Read Also: Railway Line : రామగుండం-మణుగూరు రైల్వే లైన్‌కు ఆమోదం..!
అలాగే, 24 గంటల్లోనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి మనోహర్ చెప్పారు. రైతుల పడ్డ కష్టానికి ప్రభుత్వం గుర్తింపు ఇస్తున్నామని పేర్కొన్నారు. సాంకేతికంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని సరి చేస్తున్నాం.. బాపట్ల జిల్లాలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని హామీ ఇచ్చారు. సంక్రాంతి, లేదా మార్చి వరకు కొనుగోలు చేస్తామన్నారు. ఖరీఫ్ సాగులో రైతు పండించిన ప్రతి బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.