
MLA Anirudh Reddy : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. కోనసీమపై తెలంగాణ నాయకుల దిష్టి పడిందని పవన్ కళ్యాణ్ అనడం తప్పు మాత్రమే కాదు, దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ.. ఎప్పుడూ మేము ఆంధ్రప్రదేశ్ సంక్షేమానికే మద్దతు ఇచ్చామని, రెండు రాష్ట్రాలు సౌహార్దంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటామన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర విభజన అడ్డుపడిందంటే మాత్రం ఊరుకోమన్నారు. పవన్ కళ్యాణ్ వెంటనే భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అనిరుద్ రెడ్డి.
Kapil Dev: హెడ్‌కోచ్‌గా గంభీర్ కొనసాగాలా? వద్దా?.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ప్రాంతం గురించి తప్పుగా మాట్లాడితే సహించబోమని స్పష్టం చేశారు. తెలంగాణలో ఆంధ్ర కాంట్రాక్టర్లు కోట్లు రూపాయల స్కామ్ చేసిన సందర్భాలు ఉన్నాయని, రాబోయే రోజుల్లో వారి భరతం పడతామని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హెచ్చరించారు. పవన్ కళ్యాణ్‌కు తెలంగాణలో అభిమానులు ఉన్నారని, ఆయన సినిమాలను తెలంగాణ ప్రజలు ఎప్పుడూ బహిష్కరించలేదని గుర్తుచేశారు. ప్రజల మధ్య విభేదాలు రేకెత్తించే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు.
Varanasi: బాబు అభిమానులకు గుడ్ న్యూస్.. తెలుగులో ‘వారణాసి’ టైటిల్ ఇదేనా!