
ఎంఎస్ ధోని.. టీమిండియా మాజీ కెప్టెన్. ధోని క్రేజ్ ఏంటో క్రీడాభిమానులకు తెలిసిందే. గ్రౌండ్లోకి దిగాడంటే బ్యాట్‌తో చెలరేగిపోతాడు. సిక్స్‌లతో మోత మోగిస్తాడు. అలాంటి ధోని.. తాజాగా స్టాండప్ కమెడియన్‌గా మారిపోయారు. ఓ పెళ్లికి విశిష్ట అతిథిగా హాజరైన ఆయన.. స్టేజ్‌పైకి ఎక్కి తనదైన శైలిలో జోకులు వేసి అతిథులను ఉల్లాసపరిచారు. ధోని నవ్వుతూనే అనేక మందిని నవ్వులు పూయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Udaipur Wedding: వెలుగులోకి కళ్లు బైర్లు కమ్మే విషయాలు.. ఈడీ అదుపులో ర్యాపిడో డ్రైవర్!
స్టేజ్‌పై వధూవరుల పక్కన మైక్ పట్టుకుని నిలబడిన ధోనీ.. కొత్త జంటకు పలు సలహాలు.. సూచనలు ఇచ్చారు. పెళ్లి చేసుకోవడం గొప్ప విషయమే కానీ.. చేసుకోవడానికి తొందరపడ్డారని వ్యాఖ్యానించారు. దీంతో నూతన జంటతో పాటు కుటుంబ సభ్యులు, అతిథులంతా నవ్వుకున్నారు. అనంతరం వరుడి వైపు చూస్తూ.. కొంత మంది నిప్పుతో ఆడుకోవడానికి ఇష్టపడతారని.. అందులో ఇతడు కూడా ఒకడిని అనగానే కడుపుబ్బ నవ్వుకున్నారు. ఇక్కడున్న భర్తలందరి పరిస్థితి కూడా అంతేనని.. ప్రపంచ కప్ తర్వాత తన పరిస్థితి కూడా అంతేనని.. ఇందులో తనకు కూడా మినహాయింపు లేదని వ్యాఖ్యానించారు. దీంతో మరోసారి అందరూ నవ్వుకున్నారు.
ఇది కూడా చదవండి: Gold Rates: వామ్మో.. మగువలకు బిగ్ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
ఇక ఈ సందర్భంగా నూతన వధువుకు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. ‘‘భర్త కోపంగా ఉన్నప్పుడు ఏమీ మాట్లాడొద్దని.. భర్తల కోపం కేవలం ఐదు నిమిషాలే.. ఆ తర్వాత అంతా చల్లారిపోతుంది. మీకు.. నా శుభాకాంక్షలు’’ అంటూ ధోని సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే పెళ్లి ఎక్కడ జరిగింది. ఏంటి? అనే వివరాలు మాత్రం తెలియలేదు.
ధోని జోకులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఫుల్‌ఖుషీ అవుతున్నారు. ధోనిపై ప్రశంసలు కురిస్తున్నారు. స్టాండప్ కమెడియన్‌గా జాబ్ బాగుందంటూ ఒకరు.. హాస్య పాత్ర బాగుందంటూ మరొకరు కామెంట్లు చేశారు. ఇలా రకరకాలుగా నెటిజన్లు అభిప్రాయాలు పంచుకుంటున్నారు.
Captain cool turning into Husband School
pic.twitter.com/tt7nD0I9Uf
— Professor Sahab (@ProfesorSahab) November 27, 2025
