
Nellore Crime: నెల్లూరులో గంజాయి బ్యాచ్ బరితెగించింది. విక్రయాలకు అడ్డుగా ఉన్నాడంటూ స్థానిక సీపీఎం కార్యకర్త పెంచలయ్యను అత్యంత కిరాతకంగా హతమార్చింది. కొడుకును స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్న క్రమంలో.. వేటాడి వెంటాడి 9 మంది వ్యక్తులు పెంచలయ్యను అత్యంత కిరాతకంగా కత్తులతో హతమార్చారు. హౌసింగ్ బోర్డు ఆర్చి వద్ద జరిగిన ఈ ఘటన కలకలం రేపుతుంది.. అయితే, నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులు పై కూడా గంజాయి బ్యాచ్ ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో పోలీసులు ఒకరిపై కాల్పులు జరపడంతో.. జేమ్స్ అనే నిందితుడి మోకాలికి గాయమైంది..
Read Also: Renu Desai : నన్ను వదిన అని పిలవద్దు.. జానీ మాస్టర్‌కి రేణు దేశాయ్ సీరియస్ వార్నింగ్
నెల్లూరులోని కల్లూరిపల్లిలో RDT కాలనీలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆర్‌డీటీ కాలని గంజాయి కి అడ్డాగా మారింది.. దీంతో సీపీఎం కార్యకర్తగా ఉన్న పెంచలయ్య.. గంజాయి కి వ్యతిరేకంగా పోలీసులను కలుపుకొని అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వ్యవహారం గంజాయి బ్యాచ్ కి నచ్చలేదు. దీంతో అతనికి ఎలాగైనా స్పాట్ పెట్టాలని భావించారు. గంజాయి సప్లయర్ గా ఉన్న ఓ మహిళ ఆధ్వర్యంలో పెంచలయ్యను చంపేందుకు రిక్కీ నిర్వహించారు. నిన్న కొడుకును స్కూల్ నుంచి తీసుకొస్తుండగా.. హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆర్చి వద్ద కాపు గాసిన తొమ్మిది మంది గంజాయి బ్యాచ్.. పెంచలయ్య పై కత్తులతో విరుచుకుపడ్డారు. 9 మంది అతనిపై కత్తులతో దాడి చేసి పరారయ్యారు. స్థానికులు పెంచలైన ప్రభుత్వాసుపత్రికి తరలించే లోపే ఆయన మృతి చెందాడు.
Read Also: Body Changes After 30: ముప్పై ఏళ్లు దాటిన తర్వాత మీలో ఇవి కనిపిస్తున్నాయా? అయితే జాగ్రత్త…
ఈ విషయంపై పోలీసులు కూడా స్పందించారు. పెంచలేను హత్య చేసింది గంజాయి బ్యాచ్ అంటూ ప్రకటించారు. నిందితుల కోసం వేట ప్రారంభించిన పోలీసులు.. తెల్లవారుజాము సమయంలో నిందితుడు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉన్నారని సమాచారం రావడంతో అక్కడికి వెళ్లారు. నిందితుల కోసం గాలిస్తున్న క్రమంలో జేమ్స్ అనే నిందితుడు కనిపించడంతో అతని పట్టుకోబోయారు. అతను పోలీసులపై కత్తితో దాడి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆదినారాయణ అనే కానిస్టేబుల్ కి గాయం అయింది. దీంతో పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జేమ్స్ మోకాలికి గాయమైంది.. మిగిలిన నిందితులు పరారయ్యారు. గాయపడిన జేమ్స్ తో పాటు కానిస్టేబుల్ ఆదినారాయణ పోలీసులు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.