
మున్నా మైఖేల్ మూవీతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన నిధి అగర్వాల్ అక్కడ అంతకు మించి అవకాశాలు రాక సవ్యసాచితో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చేసింది. సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ ఇలా వరసగా తెలుగులో 3 సినిమాలు చేసింది. అందం, కాస్తో కూస్తో అభినయం, డ్యాన్స్ ఉన్నా కాని, తన కెరీర్ కి బ్రేక్ ఇచ్చే హిట్ మాత్రం రావడం లేదు. రామ్ పోతినేని సరసన నటించిన ఇస్మార్ట్ శంకర్ తో నిధి అగర్వాల్ కెరీర్ లోనే ఒకే ఒక్క హిట్ వచ్చింది. కాని, అందులోనూ ఇద్దరు హీరోయిన్స్ పెర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ నభా నటేష్ కొట్టేసింది. దాంతో సోలో హీరోయిన్ గా ఒక్క హిట్ కూడా లేదు.. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వరసగా ఈశ్వరన్, భూమి రెండు తమిళ సినిమాలు చేసినా ఆశించిన ఫలితం అందని ద్రాక్షే అయ్యింది.
ఎన్నో హోప్స్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ సరసన పాన్ ఇండియా ప్రాజెక్ట్ హరి హర వీరమల్లులో నటించింది నిధి ఎంతో హడావిడి చేసినా షూట్ డిలేస్ రిలీజ్ పోస్ట్ పోన్స్, కంటెంట్ కన్విన్సింగ్ గా చెప్పకపోవడం వల్ల ఆ సినిమా బాక్సాఫీస్ ముందు నిలబడలేకపోయింది. దాంతో నిధి అగర్వాల్ కు బ్రేక్ రాలేదు. ప్రస్తుతం దిరాజాసాబ్ లో నటిస్తోంది. ప్రభాస్ సినిమా అంటే భారీ అంచనాలుంటాయి. ఇప్పుడు నిధి ఆశలన్నీ రాజాసాబ్ మీదే పెట్టుకుంది. ది రాజాసాబ్ లోనూ నిధి అగర్వాల్ ముగ్గురు హీరోయిన్స్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటోంది ఈ సినిమా హిట్ అయ్యి, నిధి కి స్కోప్ ఉన్న పాత్ర ఉంటే, టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది అదే రాజాసాబ్ అంచనాలు మిస్ అయితే ఈ అమ్మడి కెరీర్ కి ఇంతటితో ఫుల్ స్టాప్ పడినట్టే.