
NTR – Prashanth Neel: కొన్ని కాంబినేషన్లలో సినిమాలు వస్తున్నాయంటేనే అంచనాలు తారా స్థాయికి చేరుకుంటాయి. అలాంటి కాంబినేషన్లలో మొదటి వరుసలో ఉంటుంది.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ – దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్. ఆర్ఆర్ఆర్తో అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కేజీఎఫ్, సలార్ వంటి సాలీడ్ హిట్ సినిమాలతో తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ ఇద్దరి కాంబో వస్తున్న ప్రెస్టీజియస్ సినిమా ఎన్టీఆర్-నీల్ అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరణ జరుగుతుంది. తాజాగా ఈ సినిమాలో ఒక బాలీవుడ్ యాక్టర్ జాయిన్ అయ్యారనే న్యూస్ సినీ సర్కిల్లో వైరల్‌గా మారింది.
READ ALSO: AP Liquor Scam Case: లిక్కర్ కేసులో చెవిరెడ్డి ఇంప్లీడ్ పిటిషన్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం ఈ ప్రెస్టీజియస్ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నట్లు సమాచారం. తాజా న్యూస్ ప్రకారం.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనిల్ కపూర్ ఓ కీ రోల్లో నటిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. తాజా షెడ్యూల్లో ఆయన చిత్ర యూనిట్‌తో జాయిన్ కాబోతున్నట్లు టాక్ నడుస్తుంది. దీంతో ఈ సినిమాలో అనిల్ కపూర్ ఎలాంటి పాత్రలో నటిస్తాడు అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఈ కొత్త షెడ్యూల్ షూటింగ్ ఆ నెల మొత్తం కొనసాగనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో కాంతార ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోండగా, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
READ ALSO: Pelli Chesukundam Rerelease: వెంకీ మామా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రీరిలీజ్ సిద్ధమైన సూపర్ సినిమా