Off The Record: హిల్ట్ పాలసీపై ఎంపీలు రియాక్ట్ అవకపోవడానికి ప్రత్యేక కారణాలున్నాయా ?

Are There Specific Reasons Why Bjp Mps Are Not Reacting To The Hilt Policy

Off The Record: ఆ ముగ్గురు ఎంపీలు ఎందుకు మౌన వ్రతంలో ఉన్నారు? తమ పరిధిలో జరుగుతున్న కీలక పరిణామాల విషయంలో నోరెత్తక పోవడానికి కారణాలేంటి? బీజేపీకే చెందిన శాసమసభాపక్ష నేత తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ… ఏకంగా సవాళ్ళు విసురుతుంటే… అదే పార్టీ ఎంపీలు కామ్‌గా ఉండటానికి కారణాలేంటి? ఎవరా ఎంపీలు? ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాల విషయంలో చర్చలు, రచ్చలు నడుస్తున్నాయి?

Read Also: Off The Record: జిల్లాలో అగ్గి రాజేసిన డీసీసీ నియామకం.. పంచాయతీ ఎన్నికల్లో నష్టమంటున్న కేడర్

తెలంగాణ ప్రభుత్వం తాజాగా రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. పరిశ్రమల భూముల కన్వర్షన్‌కు అనుమతించే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ.. హిల్ట్‌ ఒకటైతే, ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న 27 మునిసిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలనే డెసిషన్‌ మరొకటి. ఈ రెండింటినీ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. స్టేక్ హోల్డర్స్‌ తమ వర్షన్స్‌ చెబుతున్నారు.. ఇక వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, సమర్థించే వారు సమర్థిస్తున్నారు. వివిధ పార్టీ నాయకులు కూడా ఎవరి స్టైల్‌లో వాళ్ళు రియాక్ట్‌ అవుతున్నారు. తెలంగాణ బీజేపీ సైతం తన స్టాండ్‌ చెప్పేసింది. కానీ… అదే పార్టీకి చెందిన, మంచైనా, చెడైనా ఆ నిర్ణయాల ప్రభావం పడే ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు మాత్రం ఇంత వరకూ నోరు తెరవలేదు. ఈ ప్రాంతాల నుంచి ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళలో ముగ్గురు ఎంపీలు బీజేపీకి చెందినవారే. హిల్ట్‌ పాలసీతో.. మల్కాజ్ గిరి, చేవెళ్ల, మెదక్ లోక్‌సభ నియోజక వర్గాల పరిధిలో ఉన్న పారిశ్రామిక వాడలు మల్టీపర్పస్‌ జోన్లుగా మారతాయి.

Read Also: Operation Sindhoor: ఆపరేషన్ సింధూర్‌కు భయపడిన పాకిస్థాన్.. 72 ఉగ్ర స్థావరాలను తరలించిన దాయాది

అలాగే, GHMCలో కలపాలని నిర్ణయం తీసుకున్న 27 మునిసిపాలిటీలు కూడా ఈ నియోజకవర్గాల పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయం అయినా… ప్రజల మీద ప్రభావం పడే ప్రతి అంశం మీద సంబంధిత ప్రాంతాల ప్రజాప్రతినిధులు స్పందిస్తారు. కానీ, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, రఘునందన్‌రావు మాత్రం ఎందుకు మాట్లాడ్డం లేదన్న చర్చ జరుగుతోంది. అందులోనూ.. ఈ ముగ్గురికీ ప్రజల మధ్య ఉంటారన్న పేరుంది. అలాంటి వాళ్ళు తమ సొంత నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలు, అందులోనూ మంచైనా, చెడు అయినా తీవ్ర ప్రభావం ఉండే అంశాల మీద రియాక్ట్‌ అవకపోవడానికి ప్రత్యేక కారణాలు ఏమన్నా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారట కొందరు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అభినందించడమో లేదా వ్యతిరేకించడమో ఏదో ఒకటి చేయాలి కదా..? అలాంటిదేం లేకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారని బీజేపీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయట. ఎవరికి తోచిన విశ్లేషణలతో వాళ్ళు గుసగుసలు పెంచేస్తూ… ఎంపీల వైఖరి మీద ఉత్కంఠను మరింత పెంచుతున్నారు. ఇక్కడ ఇంకో పాయింట్‌ కూడా ఉందండోయ్‌… పారిశ్రామిక భూముల్ని మల్టీపర్పస్‌ జోన్స్‌గా మార్చే హిల్ట్‌కు వ్యతిరేకంగా బీజేఎల్పీ నేత మాట్లాడుతున్నా, ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నా… అదే పార్టీకి చెందిన, పైగా ఆయా ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు ఎంపీలు మాత్రం కామ్‌గా ఉండటం ఎందుకో అర్ధం కావడం లేదన్నది రాజకీయవర్గాల మాట.