Operation Sindhoor: ఆపరేషన్ సింధూర్‌కు భయపడిన పాకిస్థాన్.. 72 ఉగ్ర స్థావరాలను తరలించిన దాయాది

Operation Sindhoor Pakistan Moves 72 Terror Launchpads

Operation Sindhoor: ఆపరేషన్ సింధూర్‌ సహా 2025లో బీఎస్ఎఫ్ దళం సాధించిన విజయాలపై బీఎస్‌ఎఫ్ డీఐజీ విక్రమ్ కున్వర్, జమ్మూ ఫ్రాంటియర్ బీఎస్‌ఎఫ్ ఐజీ శశాంక్ ఆనంద్, డీఐజీ కుల్వంత్ రాయ్ శర్మతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం సరిహద్దు వెంట కురుస్తున్న దట్టమైన పొగమంచును ఆసరాగా చేసుకుని పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం వచ్చినట్లు తెలిపారు. ఈ సమాచారం తర్వాత BSF సరిహద్దులో గస్తీని పెంచిందని, BSF సైనికులు, మహిళా సైన్యం సరిహద్దులో గస్తీ తిరుగుతున్నారని చెప్పారు. ప్రభుత్వం సరిహద్దుల్లో ఆపరేషన్లు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకుంటే, శత్రువులకు భారీగా ప్రాణనష్టాన్ని కలిగించడానికి తమ దళం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అదే సమయంలో సైనిక చర్యపై తాత్కాలిక నిషేధాన్ని బీఎస్‌ఎఫ్ గౌరవిస్తోందని వెల్లడించారు.

READ ALSO: Off The Record: జిల్లాలో అగ్గి రాజేసిన డీసీసీ నియామకం.. పంచాయతీ ఎన్నికల్లో నష్టమంటున్న కేడర్

ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్ జాగ్రత్తగా ముందుకు సాగుతోందని, ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లను సరిహద్దుకు దూరంగా మార్చిందని అన్నారు. జమ్మూలో, అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ నుంచి చొరబాటు కోసం 72 లాంచ్‌ప్యాడ్‌లు చురుకుగా ఉన్నాయని అన్నారు. ఈ లాంచ్‌ప్యాడ్‌లను అవసరం అయినప్పుడు అన్ని ఉగ్రవాద సంస్థలు ఉపయోగిస్తున్నాయని వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత అన్ని లాంచ్ ప్యాడ్‌లను నివాస ప్రాంతాలు మార్చాలని పాక్ ప్రభుత్వం సైన్యాన్ని ఆదేశించిందని అధికారు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దు వెంబడి ఉన్న అనేక ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లను బీఎస్‌ఎఫ్ ధ్వంసం చేసిందని అన్నారు. దీని తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం అటువంటి లాంచ్‌ప్యాడ్‌ ప్రదేశాలన్నింటినీ డెప్త్ జోన్‌కు మార్చిందని తెలిపారు. ఇప్పటికి సియాల్‌కోట్, జఫర్వాల్‌లోని డెప్త్ జోన్ నుంచి దాదాపు 12 లాంచ్‌ప్యాడ్‌లు పనిచేస్తున్నాయని, అయితే ఇవి సరిహద్దులో లేవు అన్నారు. అదేవిధంగా సరిహద్దుకు దూరంగా ఉన్న ఇతర లోతట్టు ప్రాంతాలలో 60 లాంచ్‌ప్యాడ్‌లు పనిచేస్తున్నాయని తెలిపారు.

ఈ లాంచ్‌ప్యాడ్‌ల సంఖ్య, అలాగే వాటిలో ఉన్న ఉగ్రవాదుల సంఖ్య కూడా మారుతూ ఉంటుందని అన్నారు. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతం ఎలాంటి ఉగ్రవాద శిక్షణా శిబిరాలు లేవని వాళ్లు అన్నారు. ఈ ఉగ్ర చొరబాట్లను అడ్డుకునేందుకు బీఎస్ఎఫ్ ఒక ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్‌ను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకుంటే, దాని ఆదేశాలను పాటించడానికి బీఎస్‌ఎఫ్ సిద్ధంగా ఉందని అన్నారు. ప్రస్తుతం సరిహద్దులో ఎటువంటి ముప్పు కలిగించే ఉగ్రవాద కదలిక లేదని తెలిపారు.

READ ALSO: Faf du Plessis: ఇక ఐపీఎల్‌లో ఈ స్టార్ ప్లేయర్ కనిపించడు..