Ranveer Singh : IFFIలో కాంతారాపై రణవీర్ కామెంట్‌.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కన్నడ అభిమానులు..

గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ముగింపు కార్యక్రమంలో రణవీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. స్టేజ్‌పై సూపర్ ఎనర్జీతో మాట్లాడడం, డ్యాన్స్ చేయడం రణవీర్‌కు కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయన చేసిన ఈ జోష్‌ కన్నడ ప్రేక్షకులను అస్సలు నచ్చలేదు. రజనీకాంత్‌కు ట్రిబ్యూట్ ఇస్తూ మాట్లాడిన రణవీర్‌ను అక్కడివాళ్లు బాగా చప్పట్లు కొట్టారు. కానీ మాటల మధ్యలో, కాంతారా సినిమాలో రిషబ్ శెట్టి చేసే దైవిక … Read more

Rain Alert In AP: ఏపీపై దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

Rain Alert In AP: దిత్వా తుఫాన్ ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. కాబట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు (నవంబర్ 30న ) ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు … Read more

Suryapet: సర్పంచ్ ఎన్నికల్లో పోటీ కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన ఎస్సై..

Suryapet: తెలంగాణ పంచాయతీ ఎన్నికల వేళ గ్రామీణ రాజకీయాలు ఊహించని మలుపులు తీసుకుంటున్నాయి. సాధారణంగా గ్రామస్థాయి పదవుల కోసం స్థానికులు, వ్యాపారులు, రైతులు పోటీకి దిగడం చూస్తుంటాము. అయితే ఈసారి సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో చోటుచేసుకున్న పరిణామం అందరి దృష్టినీ ఆకర్షించింది. సర్వీస్ మిగిలి ఉండగానే సబ్‌ఇన్‌స్పెక్టర్ పులి వెంకటేశ్వర్లు ఉద్యోగాన్ని వదిలి సర్పంచ్ పదవికే నేరుగా పోటీ చేసేందుకు సిద్ధమవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. READ MORE: Pocharam Infocity: ఇన్ఫోసిస్ … Read more

Pocharam Infocity: ఇన్ఫోసిస్ క్యాంపస్ సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు.. కట్‌చేస్తే..

Pocharam Infocity: పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ పక్కన అర్ధరాత్రి సమయంలో అనుమానాస్పద కదలికలు కనిపించాయి. టార్చ్‌లైట్లు, పూజా సామాగ్రి, గడ్డపారలతో కొందరు వ్యక్తులు ఏదో చేస్తున్నట్లు అనుమానం వచ్చింది. చూస్తే ఏదో రహస్య కార్యక్రమం జరుగుతున్నట్టే అనిపించింది. ఇదే విషయం స్థానికుల దృష్టికి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నప్పుడు.. తవ్విన ఓ పెద్ద గుంతతో పాటు.. పగలగొట్టిన కొబ్బరికాయలు, నిమ్మకాయలు కనిపించాయి. ఇది ఏదో పూజ తంతులా అనిపించింది. స్పాట్‌లో 8 మంది వ్యక్తులకు … Read more

Astrology: నవంబర్‌ 30, ఆదివారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్‌న్యూస్..!

NTV Daily Astrology as on 30th November 2025: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..

Off The Record : రాజోలు రచ్చకు అసలు కారణం ఏంటి ? పవన్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితులు మారట్లేదా ?

పార్టీ ఆవిర్భావం తర్వాత బోణీ కొట్టిన నియోజకవర్గంలో గ్లాస్‌ ఇంకా బ్యాలెన్స్ అవడం లేదా? నాయకుడు మారినా నడిపే తీరు మాత్రం మారడం లేదా? దశాబ్దానికి పైగా పార్టీ జెండా మోసిన వాళ్ళు అందుకే హర్ట్‌ అవుతున్నారా? రాజోలు జనసేన రచ్చకు అసలు కారణం ఏంటి? పవన్‌ వార్నింగ్‌ ఇచ్చాక కూడా పరిస్థితులు మారే అవకాశం లేదా? లెట్స్‌ వాచ్‌. పార్టీ పెట్టాక తొలిసారి 2019 ఎన్నికల్లో ఒకే ఒక్క అసెంబ్లీ సీటు రాజోలులో గెలిచింది జనసేన. … Read more

IBomma Ravi : ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి

IBomma Ravi : హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో మరోసారి కీలక వివరాలను వెలికితీశారు. పైరసీ వ్యవహారాన్ని పూర్తిగా తన అసలైన గుర్తింపుకి దూరంగా ఉంచాలని రవి ముందుగానే నిర్ణయించుకున్నట్లు విచారణలో స్పష్టం అయింది. ఇందుకోసం అతడు ‘ప్రహ్లాద్’ పేరుతో పూర్తిగా ఫేక్ ఐడెంటిటీని సృష్టించుకుని, ఆ పేరుతో వివిధ పత్రాలు, బ్యాంకింగ్ వ్యవస్థలు, కంపెనీ రిజిస్ట్రేషన్లను నిర్వహించాడు. రవి ప్రహ్లాద్ పేరుతోనే పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడంతో పాటు, … Read more

IND vs SA 1st ODI: రేపే సౌతాఫ్రికాతో భారత్ తొలి వన్డే.. తుది జట్టు ఇదే!

IND vs SA 1st ODI: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కోల్పోయింది. ఇప్పుడు అదే జట్టుతో 3 వన్డేల సిరీస్‌కు భారత్ సిద్ధం అవుతోంది. రేపు (నవంబర్ 30న) రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదటి వన్డే జరగనుంది. అయితే, గాయంతో శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్‌కు దూరం కావడంతో కెప్టెన్ గా కేఎల్ రాహుల్‌ను టీం యాజమాన్యం ఎంపిక చేసింది. అయితే, గిల్ స్థానంలో ఎవరు ఓపెనింగ్ చేస్తారన్నది … Read more

Team India Photoshoot: వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా సరదా ఫోటో షూట్‌! వీడియో చూశారా..

Team India Photoshoot: రాంచీలో నవంబర్ 30న టీమిండియా – దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా ఒక ఫోటోషూట్‌లో పాల్గొంది. ఈ వీడియోను BCCI సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోతో క్రికెట్ ప్రేమికులు మస్తు ఖుషీ అవుతున్నారు. వీడియోలో రిషబ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మొదలైన ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ వీడియోలో రిషబ్ పంత్‌తో ఫోటోగ్రాఫర్ మామూలు కామెడీ చేయలేదు. ఫోటో … Read more

Pakistan: పాకిస్తాన్‌కు ఫిన్లాండ్ షాక్.. రాయబార కార్యాలయం మూసివేత..

Pakistan: పాకిస్తాన్ బయటకు ఎన్ని బీరాలు పలుకుతున్నా కూడా తోటి ముస్లిం దేశాలు పట్టించుకోవడం లేదు. సౌదీ అరేబియా, యూఏఈ వంటి ఇస్లామిక్ దేశాలు పాకిస్తానీయులకు నో ఎంట్రీ బోర్డు పెడుతున్నాయి. పాకిస్తాన్ నుంచి వెళ్లిన వారు ఈ దేశాల్లో భిక్షాటన చేయడం, నేరాలకు పాల్పడుతుండటంతో ఆయా దేశాలు వీరికి వీసాలు మంజూరు చేయడం లేదు. ఇదిలా ఉంటే, తాజాగా పాకిస్తాన్‌కు మరో షాక్ తగిలింది. ఆపరేషనల్, వ్యూహాత్మక కారణాలను చెబుతూ పాకిస్తాన్‌లో ఫిన్లాండ్ తన రాయబార … Read more