CM Chandrababu: మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి..

CM Chandrababu: మీడియాతో చిట్ చాట్ లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధానిలో రైతుల సమస్యల పరిష్కారం కోసం ఒక్కటే కమిటీ వేశాం.. రైతులకు సంబంధించిన ప్రతి పనికి CRDA అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంపై విచారణ చేయిస్తాం.. పనుల కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లే రాజధాని రైతుల నుంచి సిబ్బంది డబ్బులు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూమిని త్యాగం చేసిన రైతుల సమస్యలు పరిష్కరించకుండా డబ్బులు డిమాండ్ చేస్తారా అని మండిపడ్డారు. రాష్ట్రంలో … Read more

Maulana Mahmood Madani: ముస్లింలను అవమానిస్తున్నారు.. “జిహాద్‌”పై జమియత్ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు..

Maulana Mahmood Madani: జమియత్ ఉలేమా-ఎ-హింద్ చీఫ్ మౌలానా మహమూద్ మదాని మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు, ట్రిపుల్ తలాక్, జ్ఞాన్‌వాపి-కాశీ వంటి కేసులతో సుప్రీం, హైకోర్టులపై ప్రభుత్వాలు ఒత్తిడిని పెంచుతున్నాయని ఆరోపించారు. బాబ్రీ మసీదు తీర్పు తర్వాత, ట్రిపుల్ తలాక్, ఇప్పుడు 1991 ప్రార్థనా స్థలాల చట్టాన్ని కూడా కోర్టుల్లో సవాల్ చేస్తున్నారని ఆయన అన్నారు. మసీదులు, దర్గాలనను సర్వే చేసి, హక్కులు పొందుతున్నారని ఆరోపించారు. … Read more

Maruti e Vitara: మారుతి సుజుకి మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ SUV మారుతి ఇ విటారా వచ్చేస్తోంది.. 500KM రేంజ్!

మారుతి సుజుకి తన మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ SUV, మారుతి ఇ-విటారాను డిసెంబర్ 2, 2025న భారత్ లో విడుదల చేయనుంది. దీనిని మొదటిసారిగా భారత్ లో జరిగిన ఆటో ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించారు. దీనిని భారత మార్కెట్ కోసం మాత్రమే కాకుండా 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. మారుతి ఇ విటారా భారత్ లో మేక్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ కారుగా కొత్త గుర్తింపును సృష్టిస్తోంది. ఆగస్టు 26న, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ … Read more

IND vs SA: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌.. రోహిత్‌, కోహ్లీ ఎంట్రీతో జట్టు బలం పెరిగేనా..?

IND vs SA: టీమిండియా క్రికెట్ జట్టు దాదాపు 25 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయింది. కోల్‌కతా టెస్టులో 30 పరుగుల తేడాతో ఓడిపోయన భారత జట్టు, గువహటి టెస్టులో ఏకంగా 408 రన్స్ డిఫరెన్స్ తో పరాజయం పాలైంది. కాగా, నవంబర్ 30వ తేదీ నుంచి (ఆదివారం) సౌతాఫ్రికాతో 3 వన్డేల సిరీస్‌ స్టార్ట్ కానుంది. జార్ఖండ్ లోని రాంచీ వేదికగా మొదటి వన్డే మ్యాచ్‌ జరగనుంది. … Read more

MLA Anirudh Reddy : పవన్ కళ్యాణ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలి ..

MLA Anirudh Reddy : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. కోనసీమపై తెలంగాణ నాయకుల దిష్టి పడిందని పవన్ కళ్యాణ్ అనడం తప్పు మాత్రమే కాదు, దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ.. ఎప్పుడూ మేము ఆంధ్రప్రదేశ్ సంక్షేమానికే మద్దతు ఇచ్చామని, రెండు రాష్ట్రాలు సౌహార్దంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటామన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర విభజన … Read more

Australian PM Wedding: 62 ఏళ్ల వయసులో ప్రేమ వివాహం.. ప్రధాని జీవితంలో సరికొత్త అధ్యాయం..

Australian PM Wedding: ప్రధాని హోదాలో ఒకరు వివాహం చేసుకున్నారు. ఇందులో విశేషం ఏమిటంటే ఆస్ట్రేలియా ప్రధానమంత్రి తన పదవీకాలంలో వివాహం చేసుకోవడం ఇదే తొలిసారి. ఇంతకీ ఆ ప్రధాని ఎవరో తెలుసా.. ఆంథోనీ అల్బనీస్‌. ఆయన 62 ఏళ్ల వయసులో శనివారం తన చిరకాల స్నేహితురాలు జోడీ హైడెన్‌ను వివాహం చేసుకున్నారు. READ ALSO: Karnataka Congress: సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ‘‘రాజీ’’కి కారణాలు ఇవేనా? ఈ పెళ్లి వేడుకలు కాన్‌బెర్రాలోని ఆంథోనీ అధికారిక నివాసం … Read more

Ambati Rambabu: అమరావతి కథ అంతులేని కథలా మారింది..

Ambati Rambabu: ఏపీ రాజధాని అమరావతి కథ.. అంతులేని కథలా మారింది అని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తే తమకు లబ్ది చేకూరుతుందని ఈ ప్రాంత రైతులు ఉద్యమాలు కూడా చేశారు.. అమరావతి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది.. రైతులను పెనం మీద నుంచి పొయ్యిలో పడేసేలా ప్రయత్నం చేస్తున్నారు.. అమరావతి ప్రాంత రైతులు ఇప్పటికే 35 వేల ఎకరాలు భూములు ఇచ్చారు.. మొత్తం ప్రభుత్వ భూములతో కలిపి 50 … Read more

Varanasi: బాబు అభిమానులకు గుడ్ న్యూస్.. తెలుగులో ‘వారణాసి’ టైటిల్ ఇదేనా!

Varanasi: దర్శకధీరుడు రాజమౌళి గురించి చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జక్కన్న స్థాయి ప్యాన్ ఇండియా సరిహద్దులు దాటి అంతర్జాతీయ రేంజ్‌కు వెళ్లిపోయింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత రాజమౌళి చేయబోయే నెక్ట్స్ సినిమాపై ప్రేక్షకులలో ఎన్నో అంచనాలు నెలకున్నాయి. ఇదే సమయంలో మహేష్ బాబు అభిమానులు ఖుషీ అయ్యే న్యూ్స్ వైరల్ అయ్యింది. జక్కన్న కొత్త సినిమా మహేష్ బాబుతోనే అని ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఆ సమయంలో నిర్వహించిన గ్లోబ్‌ట్రాటర్‌ ఈవెంట్‌లో … Read more

Kapil Dev: హెడ్‌కోచ్‌గా గంభీర్‌ కొనసాగాలా? వద్దా?.. కపిల్‌ దేవ్‌ సంచలన వ్యాఖ్యలు

Kapil Dev: స్వదేశంలో 2-0 తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌ టెస్ట్‌ సిరీస్‌ను కోల్పోయింది. దీంతో ప్రధాన కోచ్‌ పదవిలో గౌతమ్‌ గంభీర్‌ కొనసాగాలా? వద్దా? అనే నిర్ణయంపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది. అలాగే, స్పిన్‌ ఆడే విషయంలో టీమిండియా బ్యాటర్ల సమర్థతపై క్రికెట్‌ పండితులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టెస్ట్‌ క్రికెట్‌ నుంచి కోహ్లీ , రోహిత్‌ శర్మ, రవిచంద్రన్ అశ్విన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్న తర్వాత జట్టు తీవ్ర … Read more

Localbody Elections : ఎన్నికల బరిలో మాజీ మావోయిస్టు జ్యోతి

తెలంగాణలో జరుగుతున్న రెండవ సాధారణ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి మాజీ మావోయిస్టు నేత జ్యోతి బరిలోకి దిగుతున్నారు. మావోయిస్టు పార్టీలో 19 సంవత్సరాలుగా పనిచేసి ప్రజా సమస్యల పోరాటానికి కృషి చేశానని, 2023 సంవత్సరంలో సంవత్సరంలో లొంగిపోయిన అనంతరం, గ్రామంలో ప్రజల సమస్యలపై దృష్టి సాధించినట్లు తెలిపారు. మూడేళ్ల క్రితం లొంగి పోయిన మాజీ మావోయిస్టు నేరెళ్ల జ్యోతి సర్పంచిగా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా శివంగలపల్లికి చెందిన నేరెళ్ల … Read more