Spirit : ‘స్పిరిట్’ లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఫిక్స్ ?

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ప్రభాస్ హీరోగా, యాక్షన్–కాప్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తారంటూ వచ్చిన వార్తలకు ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చింది “నేను స్పిరిట్‌లో లేను” అని చెబుతూ రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే తాజా సమాచారం … Read more

Akshay Khanna : ఈ ఏడాది కూడా ఫైనెస్ట్ యాక్టర్‌గా మరోసారి ప్రూవ్ చేసుకోబోతున్న స్టార్ హీరో

ఛావా సినిమాలో ఔరంగజేబ్‌గా అక్షయ్ ఖన్నా తన పీక్ పెర్ఫార్మెన్స్‌ చూపించాడు. చరిత్రలో క్రూరుడిగా నిలిచిన ఔరంగజేబ్ ఇమేజ్‌ని స్క్రీన్ మీద రియలిస్టిక్‌గా ఆవిష్కరించాడు. పాత్రలోని అహంకారం, పొలిటికల్ స్ట్రాటజీస్, ఎమోషనల్ షేడ్స్ అన్నీ కలిపి ఆయన లుక్‌లో బలంగా ప్రతిబింబించాయి. ఈ నెగటివ్ రోల్ ఆయన వెర్సటైల్ యాక్టింగ్‌కి మరో హైలైట్‌గా నిలిచింది. Also Read : Urvashi : దబిడి.. దిబిడి బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ కరువు పాకిస్తాన్ టెర్రరిజాన్ని రూపుమాపేందుకు ఇండియన్ రా ఏజెన్సీ … Read more

Urvashi : దబిడి.. దిబిడి బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ కరువు

బాలీవుడ్ బోల్డ్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలా పదేళ్ల క్రితం తన 19వ ఏట ‘సింగ్‌ సాబ్‌ ది గ్రేట్‌’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. స్కిన్‌షోకు తెరలేపినా ఈఅమ్మడికి వచ్చిన ఆఫర్స్‌ అంతంత మాత్రమే. తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మూడేళ్లల్లో ఐదు సినిమాలు చేసింది.  ఊర్వశి రతౌలా బ్లాక్‌ రోజ్‌ సినిమాలోని ఐటంసాంగ్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే బ్లాక్‌ రోజ్‌ మూవీలో ఐటంసాంగ్‌ చేసిన సంగతే తెలీదు. ఆ సినిమా తర్వాత తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు … Read more

Spirit : స్పిరిట్ కోసం.. ప్రభాస్‌ విషయంలో షాకింగ్ డిసిషన్ తీసుకున్న సందీప్ రెడ్డి వంగా

ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తోన్న ‘స్పిరిట్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. అయితే సినిమా నుంచి ఏ చిన్న వివరమూ, ముఖ్యంగా ప్రభాస్ లుక్ లీక్ కాకుండా ఉండేందుకు దర్శకుడు సందీప్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. తదుపరి ఆరు నెలల వరకు ప్రభాస్ పబ్లిక్ ప్లేస్‌లలో కనిపించకూడదని వంగా కోరినట్లు తెలుస్తోంది. సినిమాలో ప్రభాస్ కొత్త … Read more

Cyclone Ditwah: శ్రీలంకపై జలఖడ్గం.. 123 మంది మృతి.. 130 మంది గల్లంతు

శ్రీలంకపై దిత్వా తుఫాన్ విరుచుకుపడింది. భారీ ఈదురుగాలులతో కుండపోత వర్షం కురిసింది. దీంతో శ్రీలంక అతలాకుతలం అయింది. పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో ఇప్పటి వరకు 123 మంది ప్రాణాలు కోల్పోయారు. 130 మంది వరకు గల్లంతయ్యారు. ఇక రంగంలోకి దిగిన అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఇళ్లు ధ్వంసమయ్యాయని.. 43,995 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు విపత్తు నిర్వహణ కేంద్రం శనివారం తెలిపింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని … Read more

Watermelon Seeds: పుచ్చ కాయ తిని గింజలు పారేస్తున్నారా.. వీటితో ఎన్ని లాభాలంటే..

మనకు తెలుసు—పండ్లు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. అలానే కొన్ని పండ్ల విత్తనాలు కూడా మన శరీరానికి ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పుచ్చకాయ గింజలు పోషకాల సమృద్ధితో ప్రత్యేక స్థానం సంపాదించాయి. పుచ్చకాయ గింజల్లో ప్రోటీన్, విటమిన్–బి, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటి కీలక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే మెగ్నీషియం, ఒమేగా–3 & ఒమేగా–6 ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాదు, … Read more

Tollywood : హిట్ పెయిర్స్.. టాలీవుడ్ సెంటిమెంట్స్..

1. చిరంజీవి, నయనతార కాంబినేషన్‌ మూడోసారి రిపీట్‌ అవుతోంది. సైరాలో భార్యాభరల్లా నటించిన చిరంజీవి, నయన ‘మన శంకరవరప్రసాద్‌’లో విడిపోయిన భార్యాభర్తల్లా కనిపిస్తున్నారు. మధ్యలో వచ్చిన గాడ్‌ఫాదర్‌లో అన్నాచెల్లెల్లుగా నటించారు. ఈ ఇద్దరి కాంబోలో సరైన హిట్‌ లేకపోయినా ఈ సెంటిమెంట్‌ను అనిల్‌ రావిపూడి పట్టించుకోలేదు. 2. బాలకృష్ణ, నయనతారది సూపర్‌హిట్‌ పెయిర్‌ కావడంతో నాలుగోసారి కలిసి నటిస్తున్నారు. సింహా, శ్రీరామరాజ్యం, జైసింహా హిట్స్‌తర్వాత నయన మరోసారి బాలయ్యతో జత కడుతోంది. గోపీచంద్‌ మలినేని డైరెక్షన్‌లో రూపొందే … Read more

Seethakka: “నాడు ఒకేరోజు.. నేడు పదిరోజులట..?” బీఆర్ఎస్ “దీక్షా దివాస్‌”పై మంత్రి సీతక్క కౌంటర్..

Seethakka: బీఆర్ఎస్ దీక్షా దివాస్ కి మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు.బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజే దీక్షా దివస్ చేసేవాళ్లన్నారు.. అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏమీ లేదు.. అందుకే ఒక్క రోజుకి అప్పుడు దీక్షా దివస్‌ను పరిమితం చేశారని వ్యాంగ్యంగా స్పందించారు. మంత్రి సీతక్క తాజాగా నాంపల్లిలో మీడియాతో మాట్లాడారు. అధికారం పోయిన తర్వాత పది రోజులపాటు దీక్షా దివస్ పేరుతో నాటకాలు ఆడాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నించారు. ప్రజలను మోసగించేందుకు, అధికార పార్టీ నిర్మించేందుకు … Read more

TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో బిగ్‌ ట్విస్ట్..

TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రారంభంలో ఫిర్యాదు చేసిన అధికారుల పేర్లు కూడా ఇప్పుడు నిందితుల జాబితాలో చేరాయి. ఈ సందర్భంగా సిట్ (SIT) మరో మెమో దాఖలు చేస్తూ మొత్తం 11 మందిని అదనంగా నిందితులుగా నమోదు చేసింది. అయితే, ఈస్ట్ పీఎస్‌లో కల్తీ నెయ్యి జరిగిందని ఫిర్యాదు చేసిన అప్పటి జీఎం మురళీకృష్ణపై కూడా కేసు నమోదు కావడం పెద్ద చర్చగా మారింది. దీంతో కేసులో … Read more

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

నెల్లూరులో సీపీఎం నేత దారణ హత్య.. అరెస్ట్‌ చేసేందుకు వెళ్లిన పోలీసులపై నిందితుల దాడి.. నెల్లూరులోని కల్లూరిపల్లిలో RDT కాలనీలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆర్‌డీటీ కాలని గంజాయి కి అడ్డాగా మారింది.. దీంతో సీపీఎం కార్యకర్తగా ఉన్న పెంచలయ్య.. గంజాయి కి వ్యతిరేకంగా పోలీసులను కలుపుకొని అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వ్యవహారం గంజాయి బ్యాచ్ కి నచ్చలేదు. దీంతో అతనికి ఎలాగైనా స్పాట్ పెట్టాలని భావించారు. గంజాయి సప్లయర్ … Read more