Mahindra XEV 9S: మహీంద్రా XEV 9S కారులో 100KM ప్రయాణానికి.. ఖర్చు రూ. 120 మాత్రమే.. డబ్బు ఆదా పక్కా!
డబ్బులు ఊరికే రావు కాబట్టి.. వృధాగా ఖర్చు పెట్టొద్దు. అందుకే చాలామంది తమ డబ్బును ఆదా చేసుకునేందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ను కొనుగోలు చేస్తున్నారు. తక్కువ ఖర్చుతోనే వందల కిలోమీటర్ల వరకు ప్రయాణించే వీలుండడంతో ఈవీలకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో మహీంద్రా & మహీంద్రా తన కొత్త ఎలక్ట్రిక్ SUV XEV 9S ని విడుదల చేసిన విషయం తెలిసిందే. మహీంద్రా XEV 9S కారులో 100KM ప్రయాణానికి.. ఖర్చు రూ. 120 మాత్రమే అవుతుందని … Read more
Trinamool Congress: బెంగాల్‌లో “బాబ్రీ మసీదు” వివాదం..తమకు సంబంధం లేదన్న తృణమూల్..
Trinamool Congress: పశ్చిమ బెంగాల్ రాజకీయాలను ‘‘బాబ్రీ మసీదు’’ వివాదం నిప్పు రాజేసింది. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. డిసెంబర్ 6 ముర్షిదాబాద్ జిల్లాలో బాబ్రీ మసీదు నమూనాతో మసీదు నిర్మిస్తామని ప్రకటించారు. ఇది బెంగాల్‌లో పెద్ద వివాదంగా మారింది. అయితే, ఎమ్మెల్యే మాటలతో తమకు సంబంధం లేదని టీఎంసీ చెప్పింది. ఈ వారం బెల్దంగా ప్రాంతంలో బాబ్రీ మసీదు నిర్మిస్తామని చెబుతూ పోస్టర్లు కనిపించాయి. Read Also: … Read more
Telangana Rising : సమ్మిట్ కు భారీ బందోబస్తు.. వీవీఐపీ ప్రతినిధుల చుట్టూ మూడంచెల భద్రత
డిసెంబర్ 8, 9వ తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహేశ్వరం, మిర్ఖాన్ పేటలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి పోలీసుశాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య భారీ బందోబస్త్ కల్పిస్తోంది. ఈరోజు మహేశ్వరంలో బందోబస్త్ మీద రాచకొండ సిపి సుధీర్ బాబు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, టీజీ ICC ఏండి శశాంక్ మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి ట్రాఫిక్ డీసీపీలతో కలిసి … Read more
Ponnam Prabhakar : ఇందిరమ్మ క్యాంటీన్ల మ్యాపింగ్ సిద్ధంగా ఉంది
Ponnam Prabhakar : పేద, మధ్యతరగతి ప్రజలకు చౌక ధరకే కడుపు నిండా భోజనం అందించే ఇందిరమ్మ క్యాంటీన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది. హైదరాబాద్‌లో కొత్తగా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు మ్యాపింగ్ కూడా సిద్ధమైంది. కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అందించే ఈ స్కీమ్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణలో పేదల ఆకలిని తీర్చే లక్ష్యంతో ఇందిరమ్మ క్యాంటీన్ల ఎస్టాబ్లిష్‌మెంట్ కోసం GHMC అధికారులు మ్యాపింగ్ ప్లానింగ్ను ఇప్పటికే సిద్ధం చేశారు. … Read more
Akhanda 2: సినిమాకు కాదు… దేవాలయంకు వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది..!
Akhanda 2: అఖండ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఫైట్ మాస్టర్ లక్ష్మణ్ భావోద్వేగంతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. తాము ఎన్నో ఆడియో ఫంక్షన్‌లు, ప్రీ-రిలీజ్ ఈవెంట్లు చూసినప్పటికీ.. అఖండ 2 ఈవెంట్ మాత్రం దేవాలయ వాతావరణాన్ని గుర్తు చేస్తున్నదని ఆయన అన్నారు. ఈ కాలంలో మనుషులు భక్తి నుండి దూరమవుతున్న తరుణంలో, ఇలాంటి సినిమాలు మళ్లీ ఆ భక్తిమార్గాన్ని చూపుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రంలో బాలయ్య బాబు కేవలం నటుడు మాత్రమే కాదు.. శివశక్తి స్వయంగా … Read more
Akhanda 2: పవర్‌ఫుల్ యాక్షన్‌తో ‘అఖండ 2 తాండవం’ కొత్త టీజర్..
Akhanda 2: నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘అఖండ 2 తాండవం’ కోసం సినీ ప్రేక్షకులు, నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌కు సూపర్ రెస్పాన్స్ రావడంతో బాలయ్య బాబు తాండవాన్ని థియేటర్లలలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. READ ALSO: Akhanda 2 Pre Release: “నందమూరి బాలుడాయ… దొమ్మలేమో అదిరిపాయా” పాట వెనకాల కథ ఇదే..! ఈ సినిమా ప్రీ-రిలీజ్ … Read more
CM Chandrababu: మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీ.. ఆ శాఖలో ప్రక్షాళన జరగాల్సిందే..!
CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అయితే, కేబినెట్ అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, కీలక ప్రాజెక్టులు, వైద్య రంగం, రాజధాని పురోగతి అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు మాట్లాడుతూ, రాజధానికి భూములు ఇచ్చిన రైతులు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు అని వెల్లడించారు. అమరావతి అభివృద్ధి వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి … Read more
Akhanda 2 Pre Release: “నందమూరి బాలుడాయ… దొమ్మలేమో అదిరిపాయా” పాట వెనకాల కథ ఇదే..!
Akhanda 2 Pre Release: నేడు జరుగుతున్న ‘అఖండ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జాతీయ అవార్డు గ్రహీత కాసర్ల శ్యామ్ భావోద్వేగంతో మాట్లాడారు. నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానికి తగ్గట్టుగా తన అనుభవాలను పంచుకున్న ఆయన, ఈ చిత్రంలోని పాట ఎలా పుట్టిందో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. “నందమూరి నటసింహం అభిమానులందరికీ నమస్కారం. ‘అఖండ’లో ఒక రుద్ర తాండవం అవసరం అయితే.. మిగతా రచయితలకే ఇవ్వొచ్చు. కానీ, బాలయ్య బాబులో ఉన్న … Read more
Aadhaar: లైన్ లో నిలబడాల్సిన అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్ ద్వారా ఇంటి నుంచే ఫోన్ నంబర్ అప్‌డేట్ చేసుకోవచ్చు
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) శుక్రవారం కొత్త ఆధార్ యాప్ కోసం కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఈ యాప్ నవంబర్ 9న ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, iOS యాప్ స్టోర్‌లో ప్రారంభమైంది. ఇది త్వరలో మొబైల్ నంబర్ అప్‌డేషన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ కొత్త ఫీచర్‌లో, యూజర్లు కొత్త నంబర్‌ను లింక్ చేయడానికి OTP, ఫేస్ అథెంటికేషన్ ను అందించాల్సి ఉంటుంది. ఇది కొత్త యాప్‌ను డిజిటల్ ఐడెంటిటీలను చూడడానికి మాత్రమే పరిమితం చేయడమే … Read more