Karnataka Congress: సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సీఎం రేసులోకి కొత్త పేరు..

Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్‌లో హైడ్రామా కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పీఠం కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎన్నికల తర్వాత ఒప్పందం ప్రకారం, చెరో రెండున్నరేళ్లు సీఎం పీఠాన్ని పంచుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే, ఇప్పుడు రెండున్నరేళ్లు పూర్తి కావడంతో డీకే వర్గం సీఎం పోస్టును కోరుతోంది. దీంతో రెండు వర్గాలు కూడా తమ బాస్‌లకే సీఎం పదవి ఉండాలని అధిష్టానంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కర్ణాటక కాంగ్రెస్ … Read more

Bank Holidays in December 2025: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. డిసెంబర్ నెలలో సగం కంటే ఎక్కువ రోజులు బ్యాంకులు బంద్

రెండ్రోజుల్లో నవంబర్ నెల ముగియనున్నది. సంవత్సరంలో చివరి నెల అయిన డిసెంబర్ ప్రారంభం కానుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ హాలిడేస్ ప్రకటించింది. ఈ నెలలో బ్యాంకులు 18 రోజులు మూసి ఉండనున్నాయి. ఇందులో ప్రభుత్వ సెలవులు, ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాలు కూడా ఉన్నాయి. అంటే సగం రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. అయితే ఈ సెలవులు రాష్ట్రాలను బట్టీ మారుతాయన్న విషయం గుర్తుంచుకోవాలి. వచ్చే నెలలో సెలవులు ఏ … Read more

Local Body Elections : ఎస్సీ రిజర్వేషన్ జాక్‌పాట్.. ఏకైక అభ్యర్థిగా మల్లమ్మ ఎంపిక

వరంగల్ జిల్లా సంగెం మండలంలోని ఆశాలపల్లి గ్రామ పంచాయతీలో రిజర్వ్ సీటు కారణంగా కొంగర మల్లమ్మ సర్పంచ్‌గా ఎన్నుకోబడ్డారు. ఆ ఊరిలో 1,600 కి పైగా ఓటర్లు ఉన్నప్పటికీ, ఎస్సీ మహిళా రిజర్వ్ సీటు కారణంగా ఒక్కరే మహిళ ఉండటంతో.. మల్లమ్మకు ఈ పదవి లభించింది. గ్రామ పంచాయతీకి రిజర్వేషన్ కింద ఎస్సీ మహిళా స్థానంలో ఒక్కరు మాత్రమే ఉండటంతో సర్పంచ్ పదవి మల్లమ్మకు వెళ్లింది అని స్థానిక ఎన్నికల అధికారులు, ఎంపీడీవో రవీందర్ తెలిపారు. Botsa … Read more

Cyclone Ditwah: దిత్వా తుఫాన్‌ ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాలు.. ఎల్లుండి ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..

Cyclone Ditwah: నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ‘దిత్వా తుఫాన్‌ ‘ కొనసాగుతోంది.. తుపాను ఉత్తర-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతానికి ఇది పుదుచ్చేరికి 410 కి.మీ., చెన్నైకి 510 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. తుపాన్ గడిచిన 6 గంటల్లో 3కి.మీ వేగంతో కదిలిందని వెల్లడించారు. ఎల్లుండి తెల్లవారుజామునకు తీవ్ర వాయు గుండంగా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకునే … Read more

NTR – Prashanth Neel: ఎన్టీఆర్-నీల్ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్..

NTR – Prashanth Neel: కొన్ని కాంబినేషన్లలో సినిమాలు వస్తున్నాయంటేనే అంచనాలు తారా స్థాయికి చేరుకుంటాయి. అలాంటి కాంబినేషన్లలో మొదటి వరుసలో ఉంటుంది.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ – దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌. ఆర్ఆర్ఆర్‌తో అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కేజీఎఫ్, సలార్ వంటి సాలీడ్ హిట్ సినిమాలతో తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ ఇద్దరి కాంబో … Read more

Annagaru Vostaru: కార్తీ కొత్త సినిమా ‘అన్నగారు వస్తారు’ టీజర్ రిలీజ్.. చూశారా..?

Annagaru Vostaru: తెలుగులో భారీ ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకున్న తమిళ నటుడు కార్తీ (Karthi).. మరోసారి ప్రేక్షకుల ముందుకు కొత్త యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రానున్నారు. గత ఏడాది ‘సత్యం సుందరం’తో మంచి విజయాన్ని అందుకున్న ఆయన, ఇప్పుడు ‘అన్నగారు వస్తారు’ అనే కొత్త చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రం తమిళంలో ‘వా వాతియార్‌’ (Vaa Vaathiyaar) పేరుతో రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్‌ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేసి చిత్ర … Read more

AP Liquor Scam Case: లిక్కర్ కేసులో చెవిరెడ్డి ఇంప్లీడ్ పిటిషన్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన ఏపీ లిక్కర్ కేసులో పిటిషన్లపై ఈరోజు జరిగిన విచారణలో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఏ–2 వాసుదేవ రెడ్డి, ఏ–3 సత్యప్రసాద్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ కొనసాగుతున్న సందర్భంగా, సహనిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ పై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. సహనిందితుడు ఇంప్లీడ్ పిటిషన్ వేయడం కొత్త విషయం కాదన్న కోర్టు.. … Read more

నయా లుక్ తో గ్రాండ్ రీఎంట్రీ కోసం రెడీ అయిన Renault Duster.. జనవరి 26న అధికారిక డెబ్యూ..!

Renault Duster: భారత ఆటోమొబైల్ మార్కెట్ లో రెనాల్ట్ డస్టర్‌కి ఉన్న క్రేజ్ మళ్లీ వచ్చేలా ఉన్నట్లు తాజా అప్‌డేట్స్ సూచిస్తున్నాయి. రెనాల్ట్ పూర్తిగా కొత్త తరం డస్టర్ SUVను జనవరి 26, 2026న భారత్‌లో అధికారికంగా లాంచ్ చేయనుంది. రోడ్లపై టెస్టింగ్ సమయంలో కనిపించిన స్పై ఫోటోలు ఈ కారు సంబంధించిన డిజైన్, ఎక్స్‌టీరియర్ లుక్‌ని మరింత ఆసక్తికరంగా మార్చాయి. హ్యుందాయ్ క్రెటాకు పోటీ ఇచ్చేలా సిద్ధమవుతున్న ఈ కొత్త డస్టర్, రెనాల్ట్ SUV లైనప్‌కు … Read more

Pelli Chesukundam Rerelease: వెంకీ మామా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రీరిలీజ్ సిద్ధమైన సూపర్ సినిమా

Pelli Chesukundam Rerelease: తెలుగు చిత్ర పరిశ్రమలో విక్టరీ వెంకటేష్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అందరు సినిమా హీరోలు అభిమానులు, వెంకీ మామా సినిమాలకు అభిమానులుగా ఉంటారు. కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ వెంకీ మామా. విక్టరీ వెంకటేష్‌కు సూపర్ జోడీ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది సౌందర్య. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు అన్ని కూడా సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. తాజాగా వీళ్లిద్దరి కాంబో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం “పెళ్లి చేసుకుందాం” … Read more

Fire-Boltt ONYX: క్రేజీ ఆఫర్ బ్రో.. రూ. 21000ల ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ కేవలం రూ. 1499కే.. అమోల్డ్ డిస్ప్లేతో

స్మార్ట్ వాచ్ లు ట్రెండీగా మారాయి. యూత్ తో పాటు పెద్దవాళ్లు కూడా స్మార్ట్ వాచ్ లను యూజ్ చేస్తున్నారు. అవి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తాయి, ఫిట్‌నెస్ ట్రాకింగ్ చేస్తాయి, రోజువారీ పనుల్లో సహాయపడతాయి. మరి మీరు కూడా కొత్త స్మార్ట్ వాచ్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే ఫైర్ బోల్ట్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్ పై క్రేజీ డీల్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో Fire-Boltt ONYX … Read more