Spirit : సైలెంటుగా మొదలెట్టారు!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘స్పిరిట్’ షూటింగ్ మొదలైంది. ఈ సినిమా షూటింగ్ నిన్న (గురువారం) హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం, హీరో ప్రభాస్ శుక్రవారం (నవంబర్ 28, 2025) నుంచి నేరుగా ‘స్పిరిట్’ సెట్స్‌లో జాయిన్ అయ్యారు. ప్రభాస్ తన షెడ్యూల్‌లో భాగంగా డిసెంబర్ నెలాఖరు వరకు హైదరాబాద్‌లో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేయనున్నారు. … Read more

Cyclone Ditwah: శ్రీలంకలో దిత్వా తుఫాను బీభత్సం.. 56 మంది మృతి

శ్రీలంకలో దిత్వా తుఫాన్ బీభత్సం సృష్టించింది. పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి. ఇంకోవైపు కొండచరియలు విరిగిపడడంతో ఆస్తి, ప్రాణ నష్టం బాగా జరిగింది. వరదలు కారణంగా ఇప్పటి వరకు 56 మంది చనిపోయారు. మరోవైపు కార్యాలయాలు, పాఠశాలలు మూసివేశారు. ఇక రంగంలోకి దిగిన అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. దేశవ్యాప్తంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య 56కు చేరుకుందని.. 21 మంది ఆచూకీ గల్లంతైందని.. 600కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు … Read more

Raviteja: కొడుకే కాదు.. కూతురు కూడా సినిమాల్లోకి!

మాస్ మహారాజా రవితేజ ఇద్దరు పిల్లలు సినీ రంగంలోకి పెద్ద అడుగులు వేస్తున్నారు. రవితేజ వారసులుగా సినిమాల్లోకి రాకుండా, తెర వెనుక ముఖ్యమైన బాధ్యతలు చేపడుతూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మహధాన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా..రవితేజ కుమారుడు మహధాన్, యువ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ కోసం పనిచేయడం విశేషం. ఈ సినిమాలో ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మహధాన్ ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా … Read more

Tollywood : టాలీవుడ్ స్టార్ హీరోల లైనప్.. ఎవరెవరి చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే

ఇండియన్ సినిమా మార్కెట్ లో టాలీవుడ్ హీరోలు చేస్తున్న సినిమాలు మరే ఇతర స్టార్స్ చేయడం లేదు. సొంత భాష దర్శకులనే కాదు పర భాష ఇండస్ట్రీ డైరెక్టర్స్ ను కూడా లైన్ లో పెడుతూ పాన్ ఇండియా మార్కెట్ పై జెండా ఎగరేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన టాలీవుడ్ హీరోల చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఎవరెవరి లైనప్ ఎలా ఉందొ ఓ సారి పరిశీలిస్తే.. ప్రభాస్ : రాబోయే 5 నుండి 6 … Read more

Kohli- Dhoni: ఓటమి తర్వాత ధోని ఇంటికి టీమిండియా ప్లేయర్లు.. ‘కెప్టెన్ కూల్’- కోహ్లీ వీడియో వైరల్..

Virat Kohli MS Dhoni in Ranchi: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ మరోసారి అభిమానుల్లో ఉత్సాహాన్ని రేపాడు. దక్షిణాఫ్రికాతో మొదటి వన్డేకు సిద్ధమవుతున్న సమయంలో గురువారం సాయంత్రం కోహ్లీ రాంచీలోని మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ నివాసానికి చేరుకోవడం క్రికెట్‌ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. కోహ్లీ కారు ధోనీ ఇంటి గేటు దాటుతుండగా బయట భారీగా చేరుకున్న అభిమానులు ఒక్కసారిగా హోరెత్తిపోయారు. మొబైల్‌ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసేందుకు తహతహలాడారు. ధోనీ కారు … Read more

Diseases in Youth:చిన్న వయస్సులోనే పెద్ద రోగాలు.. యువతలో కనిపిస్తున్న ఆందోళనకర లక్షణాలు

ప్రస్తుతం యువతలో అనేక శారీరక, మానసిక మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో 60 ఏళ్ల వయస్సు దాటిన వారిలో మాత్రమే కనిపించే సమస్యలు ఇప్పుడు 10–20 ఏళ్ల మధ్య వయస్సులోనే బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. వెన్నునొప్పి, తీవ్రమైన అలసట, కీళ్ల బలహీనత, స్ట్రెస్ హార్మోన్ల పెరుగుదల, ఆందోళన, చిన్న వయస్సులోనే జుట్టు రాలడం, బట్టతల, డయాబెటిస్, థైరాయిడ్ వంటి జీవక్రియ సంబంధిత వ్యాధులు యువతను వేధిస్తున్నాయి. బయట కారణాలే కాదు, శరీరం లోపల జరిగే మార్పులు కూడా ఈ … Read more

Cyclone Ditwah: దిత్వా తుపాన్ ప్రభావం.. నేటి నుంచి ఏపీలో భారీ వర్షాలు!

నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుపాన్ ఏర్పడింది. ప్రస్తుతానికి ఇది ట్రింకోమలీ (శ్రీలంక)కి 80 కి.మీ, పుదుచ్చేరికి 480 కి.మీ, చెన్నైకి 580 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 8 కి.మీ వేగంతో తుపాన్ కదిలింది. ఎల్లుండికి నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. దిత్వా తుపాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు … Read more

Tollywood : ‘స్టార్ పవర్ కాదు స్టోరీ యే పవర్’ అని నిరూపించిన చిన్న సినిమాలు

90స్ ఏ మిడిల్ క్లాస్ బయో పిక్ ఈ ఒక్క వెబ్ సిరీస్‌తోనే ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ మధ్యతరగతి మనసులు చదివి వాటిని తెర మీద నవ్వుల రూపంలో చూపించిన ప్రతిభ అతనిది. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాలకు డైరెక్షన్ చేయబోతున్నాడు. నితిన్‌తో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సితారలో మరో సినిమా ఈ రెండు ప్రాజెక్ట్స్‌తో ఆదిత్య హాసన్ పేరు ఇక వెబ్ నుంచి సిల్వర్ స్క్రీన్‌ పై మెరిసే డైరెక్టర్‌గా … Read more

KVN Productions : మరో స్టార్ హీరోను లైన్లో పెట్టిన కేవీఎన్

టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో కొత్త నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ సంచలనాలకు తెరలేపుతోంది. భారీ ప్రాజెక్టులను నిర్మించాలనే లక్ష్యంతో ఈ సంస్థ ఏకంగా టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ పనిచేయడానికి సిద్ధమవుతోంది. ఇది సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, KVN ప్రొడక్షన్స్ ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లతో ప్రాజెక్టులను ఖరారు చేసుకున్న తరువాత, ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కూడా అడ్వాన్స్ చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ దూకుడు … Read more

Hong Kong fire: 94కు చేరిన అగ్నిప్రమాద మరణాలు.. పలువురు ఆచూకీ గల్లంతు

హాంకాంగ్ అగ్నిప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఊహించని విపత్తుతో ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. తమ వారిని కోల్పోవడమే కాకుండా.. సమస్తం దహించుకుపోవడంతో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తమ వారి కోసం కోసం బంధువులు, కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఇక మరణాల సంఖ్య పెరుగుతోంది. బహుళ అంతస్థుల్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇప్పటి వరకు 94 మంది చనిపోయారని.. పలువురి ఆచూకీ గల్లంతైనట్లుగా అధికారులు తెలిపారు. తప్పిపోయిన వందలాది మంది ఆచూకీ కోసం గాలిస్తున్నట్లుగా … Read more