Pak vs Sri Lanka: పాక్-శ్రీలంక మ్యాచ్‌లో గందరగోళం.. అంపైర్‌తో పాకిస్థాన్ ఆటగాళ్ల గొడవ(వీడియో)..

Pakistan Wins T20 Tri Series Umpire Controversy Fakhar Shaheen

Pakistan vs Sri Lanka: తాజాగా పాకిస్థాన్ జట్టు శ్రీలంక జట్లు మధ్య టీ20 సిరీస్ ముగిసింది. పాక్ T20I ట్రై-సిరీస్‌ను గెలుచుకుంది. నవంబర్ 29వ తేదీ శనివారం రావల్పిండిలోని క్రికెట్ స్టేడియంలో జరిగిన టైటిల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక 115 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. 8 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది పాక్.. ఈ మ్యాచ్ లో థర్డ్ అంపైర్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయం పెద్ద సమస్యగా మారింది. ఇది పాక్ ఆటగాళ్లు ఫఖర్ జమాన్, షాహీన్ అఫ్రిదిలకు కోపం తెప్పించింది. దీంతో ఈ ఆటగాళ్లు మైదానంలోని అంపైర్‌తో గొడవకు దిగారు. ఈ ఘటన శ్రీలంక ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో జరిగింది.

READ MORE: National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం.. సోనియా, రాహుల్కి బిగుస్తున్న ఉచ్చు..

19 ఓవర్‌లో షహీన్ అఫ్రిది బంతిని నెమ్మదిగా వేశాడు. శ్రీలంక కెప్టెన్ దాసన్ షనక ఫ్లిక్ షాట్ కోసం ప్రయత్నించాడు. టైమింగ్ లేకపోవడంతో బంతి అతని బ్యాట్ అంచుకు తగిలి షార్ట్ థర్డ్ మ్యాన్ వైపు వెళ్లింది. అక్కడే ఉన్న ఫఖర్ జమాన్ చాలా దూరం పరిగెత్తి అద్భుతమైన డైవింగ్ క్యాచ్ తీసుకున్నాడు. పాకిస్థాన్ ఆటగాళ్లు అది క్లీన్ క్యాచ్ అని ఉత్సాహంగా గంతులేశారు. అయితే థర్డ్ అంపైర్ రషీద్ రియాజ్.. చాలాసార్లు రీప్లేలను పరిశీలించిన బ్యాట్స్‌మన్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. బంతి నేలను తాకిందని రియాజ్ భావించాడు. ఈ నిర్ణయం ఫఖర్ జమాన్‌కు కోపం తెప్పించింది. షాహీన్ అఫ్రిది టీవీ అంపైర్ బాక్స్ వైపు కోపంగా చూశాడు. గ్రౌండ్‌లో ఉన్న అంపైర్‌తో సైతం వాగ్వాదానికి దిగాడు. అయితే.. షహీన్ అఫ్రిది ఆ తర్వాతి బంతికే దసున్ షనక వికెట్‌ను పడగొట్టాడు. షనకను షాహీన్ అఫ్రిది నెమ్మదిగా బంతితో బౌల్ చేశాడు. షహీన్, ఫఖర్ జమాన్ గంతులేస్తూ.. టీవీ అంపైర్ బాక్స్ వైపు సైగ చేస్తూ ఎగతాళి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడయాలో వైరల్‌గా మారింది.

READ MORE: Sharwanand : శ్రీను వైట్ల-శర్వానంద్ సినిమాలో యంగ్ బ్యూటీ ఫిక్స్..