
Pawan Kalyan : అమరావతిలో జనసేన పార్టీకి చెందిన లోకసభ సభ్యులు బాలశౌరి, తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌తో ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎంపీలకు అనుసరించాల్సిన వ్యూహాలపై పవన్ కళ్యాణ్ స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. దేశ ప్రయోజనాలను కేంద్రీకరించిన చర్చల్లో సక్రమంగా పాల్గొనడానికి ముందస్తు సన్నాహాలు చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేసే దిశగా సంబంధిత కేంద్ర శాఖల మంత్రులతో భేటీలు ఏర్పాటు చేసి, వివరణాత్మక నివేదికలు సేకరించాల్సిన అవసరాన్ని పవన్ కళ్యాణ్ ఎంపీలకు వివరించారు.
Akhanda 2: బోయపాటి ఎనర్జీ, బాలయ్య ప్యాషన్.. హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
రాష్ట్రానికి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతికి సంబంధించి కేంద్రం అందిస్తున్న సహకారం అత్యంత కీలకమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి రంగాల్లో కేంద్ర పథకాల ద్వారా వచ్చే నిధుల వినియోగం, ప్రస్తుతం రావాల్సిన విడుదలలపై రాష్ట్ర అధికారులు అందించే వివరాలను పరిశీలించి, తగిన అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలంటూ ఆయన ఎంపీలను ఉత్సాహపరిచారు. జనసేన తరఫున పార్లమెంట్లో రాష్ట్ర హక్కులను గట్టిగా ఉంచే విధంగా చురుకైన పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ మరోసారి గుర్తుచేశారు.
Akhanda 2: సినిమాకు కాదు… దేవాలయంకు వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది..!