
Ponnam Prabhakar : పేద, మధ్యతరగతి ప్రజలకు చౌక ధరకే కడుపు నిండా భోజనం అందించే ఇందిరమ్మ క్యాంటీన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది. హైదరాబాద్‌లో కొత్తగా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు మ్యాపింగ్ కూడా సిద్ధమైంది. కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అందించే ఈ స్కీమ్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
తెలంగాణలో పేదల ఆకలిని తీర్చే లక్ష్యంతో ఇందిరమ్మ క్యాంటీన్ల ఎస్టాబ్లిష్‌మెంట్ కోసం GHMC అధికారులు మ్యాపింగ్ ప్లానింగ్ను ఇప్పటికే సిద్ధం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ… బాగలింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద ఒక కొత్త ఇందిరమ్మ క్యాంటీన్‌ను లాంచ్ చేశారు. నగరానికి ఉపాధి కోసం వస్తున్న వేలాది మందికి ఈ క్యాంటీన్లు చాలా సౌకర్యంగా ఉంటాయని తెలిపారు.
ముఖ్యంగా ఉదయాన్నే పనికి వెళ్లేవాళ్లు ఎక్కడికీ ఇబ్బంది పడకుండా.. ఇక్కడే కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన అల్పాహారం, మధ్యాహ్నం సమయంలో భోజనం తీసుకోవచ్చని స్పష్టం చేశారు. ఇంకా ఎక్కడైనా కొత్తగా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనుకుంటే… ప్రజలు లేదా ప్రజాప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు వస్తే, ప్రభుత్వం తరపున ఆ ప్రాంతాన్ని గుర్తించి త్వరలోనే ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఈ చొరవతో… హైదరాబాద్ నగరంలో పేదలకు ఆకలి బాధలు తీరే ఛాన్స్ ఉంది.