Ragging: మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. గతేడాది బాధితుడే.. నేడు నిందితుడు..!

Ragging Shock At Nagarkurnool Medical College Last Years Victim Now Accused As Senior

Ragging: నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఘటన సంచలనంగా మారింది.. జూనియర్లను వేధించిన ఘటన 15 రోజుల క్రితమే జరిగినప్పటికీ, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నలుగురు సీనియర్ విద్యార్థులు.. జూనియర్లను సిట్అప్స్ చేయించడం, ఇతర అవమానకర చర్యలకు పాల్పడడం వంటి వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.. బాధిత విద్యార్థులు ఈ విషయాన్ని యాంటీ ర్యాగింగ్ కమిటీకి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయటకు పొక్కింది.. అయితే వైద్య కళాశాల యాంటీ ర్యాగింగ్ సెల్, కాలేజీ డిసిప్లినరీ కమిటీ విచారణ పూర్తిచేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు..

Read Also: Spirit : స్పిరిట్ కోసం.. ప్రభాస్‌ విషయంలో షాకింగ్ డిసిషన్ తీసుకున్న సందీప్ రెడ్డి వంగా

ఈ ఘటనలో షాకింగ్‌ ట్విస్ట్‌ ఏంటంటే.. గత ఏడాది బాధితుడు ఇప్పుడు నిందితుడు.. నిందితుల్లో ఒకరు దీపక్ శర్మ గతేడాది ఇదే కళాశాలలో ర్యాగింగ్ బారిన పడ్డ వ్యక్తి కావడం షాకింగ్ అంశంగా మారింది.
సమాజంలో “ర్యాగింగ్ బాధితుడే తరువాత ర్యాగర్ అవుతాడు” అనే ప్రమాదకర ధోరణికి ఇది మరో ఉదాహరణగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఒక వేళ విద్యార్థులపై చర్యలు తీసుకుంటే.. కాలేజీ క్లాసుల నుంచి 2 నెలల పాటు సస్పెండ్‌ చేస్తారు.. కాలేజీ అధికారిక కార్యక్రమాల నుంచి కూడా రెండు నెలలు నిషేధం ఉంటుంది.. ఇక, హాస్టల్‌లో ఉండటంపై ఏడాది పాటు నిషేధం ఉండనుంది.. ర్యాగింగ్‌కు జీరో టాలరెన్స్ పాలసీ.. మళ్లీ ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని కాలేజీ ప్రిన్సిపాల్, యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు..