Rajendra Prasad: మరోసారి నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. బ్రహ్మానందం పై బోల్డ్ కామెంట్!

Rajendra Prasad Brahmanandam Bold Comment Sakutumbanam Controversy

గత కొద్ది రోజులుగా ఈవెంట్లలో బోల్డ్ కామెంట్స్ తో వరుసగా వివాదాలకు కారణమవుతున్నారు సినీ నటకిరీటి, డాక్టరేట్ హోల్డర్ రాజేంద్ర ప్రసాద్. ఇక తాజాగా ‘సకుటుంబానాం’ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు బ్రహ్మానందం, బుచ్చిబాబు, రాజేంద్ర ప్రసాద్ ఇలా అందరూ హాజరయ్యారు. సినిమా ట్రైలర్ అయితే చక్కగా, పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉంది. కానీ ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్లు మాత్రం చర్చకు ధారి తిస్తున్నాయి.

Also Read : Rakul Preet Singh : MRI రిపోర్ట్‌ను జేబులో పెట్టుకొని సెట్‌కు వెళ్ళేదాని..

ముందుగా బ్రహ్మానందం మాట్లాడిన వెంటనే స్టేజ్ మీదే “ముసలి ముం** కొడకా” అని ఒక్కసారిగా జోక్ పేరిట పేల్చేశారు రాజేంద్ర ప్రసాద్. అక్కడున్న వాళ్లు ఒక్కసారిగా కాసేపు షాక్‌ అయ్యారు. బ్రహ్మానందం కూడా అతని వైపు తిరిగి “ఎవరు?” అన్నట్టు అడిగానరు. రాజేంద్ర ప్రసాద్ వెంటనే “నేనే” అని నవ్వుతూ మాట మార్చేశారు. కానీ అప్పటికే వీడియో రికార్డు అయిపోయింది, సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌ అయ్యింది.

ఇంతకు ముందు కూడా ‘రాబిన్ హుడ్’ మూవీ ఈవెంట్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి అనవసరంగా మాట్లాడారు. తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో అలీ గురించి అనకూడని మాటలు అనేశాడు. అప్పుడు కూడా జనం బాగా విమర్శించారు. తర్వాత ఆయన తన స్టైల్‌లో సమర్ధించుకున్నారు. అవి మరిచిపోతున్నంతలోనే ఇప్పుడు బ్రహ్మానందం మీద కూడా అలాగే కామెంట్స్ చేయడంతో మళ్లీ అదే చర్చ మొదలైంది.

‘సకుటుంబానాం’ సినిమా మాత్రం పేరు చెప్పినట్టుగానే పక్కా కుటుంబ కథ అనిపిస్తుంది. రామ్ కిరణ్ డిఫరెంట్ లుక్‌లో కనిపించాడు, మేఘా ఆకాశ్ కూడా బాగానే చేశారు. ట్రైలర్ చివర్లో రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ డైలాగ్ చెబుతారు కానీ అదే ఆయనే ఈవెంట్‌లో ఇలాగామాట్లాడడంతో కొంచెం నిరాశ పరిచింది. దీంతో సోషల్ మీడియాలో.. “సీనియర్ ఆర్టిస్ట్, అంత అనుభవం ఉన్నవారు ఇలా మాట్లాడటం బాగాలేదు”, “జోక్ అన్నా, స్టేజ్ మీద ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించాలి”, “గౌరవం కోల్పోతున్నారు” అని చాలా మంది రాస్తున్నారు. మరి ఇంతకీ ఈసారి కూడా రాజేంద్ర ప్రసాద్ ఇదొక ‘ఫన్ జోక్’ అంటూ సమర్ధించుకుంటారా? లేక నిజంగా కాస్త జాగ్రత్త పడతారా? అన్నది చూడాలి. కానీ ఏదేమైనా, తనంతటి స్థాయిలో ఉన్న నటుడు ఇలాంటి మాటలతో హెడ్లైన్‌లోకి రావడం మాత్రం మంచిది కాదని చాలామంది భావిస్తున్నారు.