
బాలీవుడ్లో ఇటీవల విడుదలైన ‘దే దే ప్యార్ దే 2’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అజయ్ దేవ్‌గణ్ మరోసారి తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించగా, రకుల్ ప్రీత్ సింగ్‌కి ఈ చిత్రం మరలా ఫామ్‌కి వచ్చి మంచి కంబ్యాక్ అయ్యింది. అయితే ఈ విజయానికి వెనక ఆమె శారీరక ఇబ్బందులు, తీవ్రమైన నొప్పులు చాలా మందికి తెలియవు. తాజాగా ఈ విషయాల గురించి పంచుకుంది రకుల్..
Also Read : Spirit : స్పిరిట్‌లో బోల్డ్ బ్యూటీ .. స్పెషల్ సాంగ్‌తో పాటు కీలక పాత్ర !
‘ షూటింగ్ మధ్యలో లెవెల్-5 మస్కులర్ టియర్ అనే ప్రమాదకరమైన గాయానికి గురయ్యాను. నడుము కండరాలు దాదాపు దెబ్బతిన్న గా నడవడమే కాదు, నిలబడటం కష్టంగా మారింది. కొన్ని సందర్భాల్లో కాళ్లలో కరెంట్ షాక్ వచ్చినట్టు నొప్పి వేసింది. ఈ పరిస్థితుల్లో కూడా ఒక రోజూ షూటింగ్‌కు హాజరు కాకుండా ఉండలేదు. యాక్షన్ సీన్లు, డ్యాన్స్ ఎందులో కూడా గివ్‌అప్ ఇవ్వకుండా.. అన్నీ పెయిన్‌కిల్లర్స్ తీసుకుంటూ, ఫిజియో చికిత్స చేస్తూనే పూర్తి చేశా. కానీ ఏ క్షణం ఏమవుతుందో అని MRI రిపోర్ట్‌ను ప్రతిరోజూ జేబులో పెట్టుకొని సెట్‌కు వెళ్తూ ఉండేదని. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే వెంటనే డాక్టర్లకు చూపించొచ్చు. ఒక్క సారి షాట్ ఓకే అయితే వెంటనే నేలపైనే పడిపోయేదని. డాక్టర్లు ఆరు నెలల విశ్రాంతి సూచించినప్పటికీ, రెండు నెలల్లోనే తిరిగి సెట్లోకి వచ్చేదాని ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నానని, కానీ ఆ రోజులు నా జీవితంలో ఎన్నటికీ మరచిపోలేని రోజులు’ అని చెప్పింది.
ఈ సంఘటనతో రకుల్ కేవలం గ్లామర్ హీరోయిన్ మాత్రమే కాదు, బాధ్యతాయుతమైన టీమ్ ప్లేయర్, గట్టి మనసుతో పోరాడే ఫైటర్ అని అభిమానులు ప్రశంసిస్తున్నారు. సాధారణంగా నటీనటులు గాయాల్ని బయట పెట్టరు. కానీ రకుల్ మాత్రం ధైర్యంగా తన సమస్యను పంచుకోవడం ద్వారా చాలా మందికి ప్రేరణ గా నిలిచింది.