RAPO : అనుకున్నదానికంటే తగ్గిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మొదటి రోజు వసూళ్లు..

Andhra King Taluka First Day Collections Lower Than Expected

ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. మహేశ్ బాబు. పి దర్శకత్వం వహించిన ఈ సినిమాను. మైత్రీ మూవీ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. రామ్ కెరీర్ లో 22వ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది.

Also Read : Bollywood : భారీ రన్ టైమ్ తో రిలీజ్ కాబోతున్న బాలీవుడ్ బిగ్ సినిమా

డబుల్ ఇస్మార్ట్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత రామ్ నుండి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు వసూళ్లు చూస్తే గుంటూరు – రూ. 10 లక్షలు, తూర్పు గోదావరి – 11 లక్షలు షేర్ రాబట్టగా కృష్ణ రూ. 20 లక్షలు గ్రాస్ వసూలు చేసింది. ఇక పశ్చిమ గోదావరి రూ. 16.20 లక్షలు సాధించింది. ఉత్తరాంధ్ర డే వన్. 30 లక్షలు షేర్ చేసింది. కంటెంట్ మీద నమ్మకంతో దర్శకుడు మహేశ్ .పి విశాఖ రైట్స్ కొనుగోలు చేశాడు. అటు హీరో రామ్ నైజాంతో పాటు గుంటూరు రైట్స్ ను కొనుగోలు చేశారు. అయితే ఓవర్సీస్ లో ఆంధ్ర కింగ్ తాలూకా కాస్త బెటర్ ఓపెనింగ్ అందుకుంది. నార్త్ అమెరికాలో డే – 1 275 k డాలర్స్ వసూలు చేసి రామ్ పోతినేని కెరీర్ లో హయ్యెస్ట్ ఓపెనింగ్ అందుకున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తే అటు ఇటుగా రూ. 7.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాయి. గురువారం వర్కింగ్ డే కావడంతో అనుకున్న దాని కంటే కాస్త అందుకుంది, మౌత్ టాక్ కారణంగా వీకెండ్ మంచి వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది.