Red Fruits, Vegetables: ఎరుపు రంగు పండ్లలో ఇన్ని రకాల పోషకాలున్నాయని మీకు తెలుసా..

Winter Health Benefits Of Red Fruits And Vegetables Boost Immunity Heart Health

చలికాలం రాగానే గాలిలో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో మన శరీరం సీజనల్ ఇన్ఫెక్షన్లకు బలహీనంగా మారుతుంది. ఈ సమయంలో గొంతు నొప్పి, జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు రావడం సాధారణం. అంతేకాకుండా చలిలో గుండెపై ఒత్తిడి పెరగబట్టి, హృదయ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా అధికంగా ఉంటుంది. నిపుణుల ప్రకారం చలికాలంలో గుండెపోటు ప్రమాదం సుమారు 53% వరకు పెరుగుతుంది.

అయితే ఈ సమస్యలను నివారించడంలో ఎర్రటి పండ్లు మరియు ఎర్రటి దుంపలు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

దానిమ్మలో పుష్కలంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించడంలో సహాయపడతాయి. ధమనుల్లో బ్లాక్స్ ఏర్పడకుండా కాపాడుతాయి. హృదయ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. చలికాలంలో దానిమ్మను ఆహారంలో చేర్చడం హృదయ ఆరోగ్యానికి చాలా మంచిది.

క్రాన్‌బెర్రీస్‌లో ఉండే సూక్ష్మపోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, శోథ నిరోధక లక్షణాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి. ఇమ్యూనిటిని పెంచి జలుబు వంటి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. రోజు ఒక యాపిల్ డాక్టర్‌ను దూరంగా ఉంచుతుంది” అనే మాటకు శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. రెడ్ యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ ఫ్లేవనాయిడ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతిరోజూ రెండు యాపిల్స్ తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు

బీట్‌రూట్‌లో విటమిన్లు, నైట్రేట్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఫ్రీ రాడికల్స్‌ వల్ల కలిగే కణ నష్టాన్ని తగ్గిస్తాయి. శరీర సహజ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. చలికాలంలో బీట్‌రూట్‌ను సలాడ్, జ్యూస్ లేదా ఉడికించిన రూపంలో తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

చలికాలంలో ఎర్రటి పండ్లు, దుంపలను ఆహారంలో సంపూర్ణంగా చేర్చుకుంటే జలుబు, దగ్గు వంటి చలి సమస్యలు దూరమవుతాయి. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. శరీరం రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజూ చిన్న చిన్న మార్పులతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.