
తెలుగు ప్రేక్షకుల మన్నన పొందిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణు దేశాయ్ గురించి పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్‌తో విడాకుల తర్వాత ఆమె సినీ జీవితానికి వీడ్కోలు పలకడం, పిల్లలు అకీరా నందన్, ఆద్యలే లోకంగా బతకడం, ఎన్జీవో ద్వారా మూగ జీవాల సంరక్షణలో భాగంగా పని చేయడం అలా ప్రశాంతమైన జీవితం గడుపుతొంది. రెండో పెళ్లిపై గాసిప్స్ వచ్చినప్పటికీ అవన్నీ గాలి వార్తలు అని రేణు ఎప్పటికప్పుడు స్పందిస్తూ వస్తుంది. అలా సంప్రదాయాలు, కట్టుబాట్లకు విలువనిచ్చే, ఆధ్యాత్మిక మార్గాన్ని ఇష్టపడే రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉన్నా, ఎవరి అనుమతి లేకుండా ఆమె జీవిస్తున్నాను అని గుర్తు చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా..
Also Read : Rashi Khanna: నా కంఫర్ట్ జోన్ దాటి దిగజారిపోయే పాత్రలు నాకొద్దు..
లాంగ్ గ్యాప్ తర్వాత రేణు దేశాయ్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘పదహారు రోజుల పండుగ’ మూవీలో తాను నటిస్తోందని ప్రకటించారు. సాయికృష్ణ దమ్మాలపాటి హీరోగా, ఉద్యన్ హీరోయిన్గా, సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో, స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్, కృష్ణుడు, విష్ణు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ప్రదా పిక్చర్స్, సాయి సినీ బ్యానర్‌పై సురేశ్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ నిర్మాణం చేస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన ఓపెనింగ్ కార్యక్రమంలో జానీ మాస్టర్ రేణు ను చూసి “వదిన” అని పిలిచారు. అయితే రేణు సీరియస్ అయ్యి “నీకు ఎన్నిసార్లు చెప్పాలి వదిన అని పిలవద్దు, అక్క అని పిలువు” అన్నారు. దీంతో జానీ మాస్టర్ నమస్కారం చేసి, పక్కన ఉన్న అనసూయ భరద్వాజ్‌ను పలకరించాడు. ప్రజంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.