Russia-WhatsApp: రష్యా సంచలన నిర్ణయం.. వాట్సాప్‌పై నిషేధం!

Russian Threats To Whatsapp

రష్యాలో వాట్సాప్ నిషేధానికి అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు వాట్సాప్‌ను రష్యా బెదిరించింది. రష్యన్ చట్టాన్ని పాటించడంలో విఫలమైతే వాట్సాప్‌ను పూర్తిగా నిషేధం విధిస్తామని రష్యా రాష్ట్ర కమ్యూనికేషన్ వాచ్‌డాగ్ బెదిరించింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఇది కూాడా చదవండి:Delhi Car Blast: 3 పెళ్లిళ్లు.. ఇద్దరు పిల్లలు.. వెలుగులోకి షాహీన్ ప్రేమకథ!

రష్యా అధికారులకు సమాచారం అందించడంలో మెటా యాజమాన్యం విఫలమైనట్లుగా తెలుస్తోంది. ప్రజల డేటాను పంచుకోవాల్సిందిగా కోరింది. అందుకు ససేమిరా అందింది. దీంతో రష్యన్ అవసరాలను తీర్చలేనప్పుడు వాట్సాప్ ఎందుకు అని ప్రశ్నిస్తోంది. వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా యూజర్లు దేశీయ యాప్‌లను ఎంచుకోవాలని ప్రజలకు సూచించింది.

ఇది కూాడా చదవండి: Cyclone Ditwah: శ్రీలంకపై జలఖడ్గం.. 123 మంది మృతి.. 130 మంది గల్లంతు

రష్యా బెదిరింపులపై మెటా సంస్థ స్పందించింది. యూజర్ల డేటా, కమ్యూనికేషన్‌ను సురక్షితంగా ఉంచే హక్కును ఉల్లంఘించేలా రష్యా చర్యలు తీసుకుంటుందని.. వాటిని తాము అడ్డుకుంటున్నందుకు మెసేజింగ్ యాప్‌పై నిషేధం విధించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది.

రష్యాలో ప్రస్తుతం టెలిగ్రామ్, వాట్సాప్ అత్యంత ప్రజాదరణ పొందాయి. అయితే ప్రజల డేటాను యాక్సెస్ చేసే వీలు కల్పించాలని గత కొద్దిరోజులుగా రష్యా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఆగస్టు నుంచి వాట్సాప్ కాల్ చేసుకోకుండా నిషేధం విధించింది. అయితే ప్రజల డేటాను పంచుకునేందుకు మెటా నిరాకరించింది. ఈ నేపథ్యంలో రష్యాలో పూర్తిగా వాట్సాప్‌పై నిషేధం విధించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.