
Save Trees Maharashtra: మహారాష్ట్రలోని పంచవటి, తపోవనం ప్రాంతాల్లో గల వేలాది చెట్లు నరికివేతకు ఆ రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ నటుడు సాయాజీ షిండే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చెట్లను నరికివేసి నాసిక్ ప్రజలను ఎగతాళి చేయొద్దని కుంభమేళా మంత్రి గిరీశ్ మహాజన్‌ను ఉద్దేశించి ఆయన ఈ కామెంట్స్ చేశారు. అయితే, వచ్చే ఏడాది కుంభమేళా నాటికి పంచవటి, తపోవనాల్లో సాధువుల కోసం వసతి గృహాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పనుల కోసం 220 కోట్ల రూపాయల విలువైన టెండర్లకు ఆహ్వానం పలికింది.
Read Also: Spirit : స్పిరిట్‌లో బోల్డ్ బ్యూటీ .. స్పెషల్ సాంగ్‌తో పాటు కీలక పాత్ర !
అయితే, పంచవటి, తపోవనాల్లో ఉన్న మొత్తం 35 ఎకరాల్లోని 1,825 చెట్లను నరికి వేయాలని నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం చేసింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గత 8 రోజులుగా పర్యావరణవేత్తలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నిరసనలలో భాగంగా శనివారం పర్యావరణవేత్త, నటుడు సాయాజీ షిండే తపోవనాన్ని సందర్శించి అక్కడి చెట్లు నరికివేతను తీవ్రంగా వ్యతిరేకించారు. చెట్లను నరికి పర్యావరణాన్ని నాశనం చేయొద్దని కోరారు.