
దర్శకుడు శ్రీను వైట్ల మరియు హీరో శర్వానంద్ కలయికలో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే.శర్వానంద్ ఇప్పటికే తన లుక్ కోసం కసరత్తులు ప్రారంభించారు. గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్–కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ ఫలితాన్ని సాధించిన తర్వాత, దర్శకుడు ఈ కొత్త సినిమాతో టాలీవుడ్లో మరోసారి బాగా గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ కోసం ‘మ్యాడ్’, ‘8 వసంతాలు’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ ను హీరోయిన్ గా ఫిక్స్ అయిందట.
Also Read : Spirit : స్పిరిట్లో బోల్డ్ బ్యూటీ .. స్పెషల్ సాంగ్తో పాటు కీలక పాత్ర !
‘8 వసంతాలు’ తో కుర్రకారు హృదయాలను ఇప్పటికే గెలుచుకున్న అనంతిక, శర్వానంద్ సరసన స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా వుంటుందో అని అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. తాజా కథ ప్రకారం, హీరో జీవితంలో ఒక అవిష్కృత సంఘటన, అతని యంగ్ ఏజ్ లో జరిగిన ఆవేశపు సంఘటన ద్వారా సినిమాకు మరింత ఎమోషనల్ డెప్త్ లభిస్తుందట. ఈ సినిమా ఈ ఏడాది చివరలో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. అదనంగా, మరో సీనియర్ నటుడు కూడా ప్రధాన పాత్రలో కనిపించనుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ను భారీ స్థాయిలో నిర్మించనున్నారు.