Sidharth – Kiara: పాప పేరును రివీల్ చేసిన స్టార్ కపుల్..

Sidharth Kiara Reveal Baby Girl Name Saraya Malhotra

Sidharth – Kiara: బాలీవుడ్ స్టార్ కపుల్ సిద్ధార్థ్‌ – కియారా తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. కియారా జులై 15న పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ స్టార్ కపుల్ తాజాగా ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటనలో నేడు వారి పాప పేరును సరాయా మల్హోత్ర (అర్థం యువరాణి) అని పెట్టినట్లు ప్రకటిస్తూ, అందరి ఆశీర్వాదాలు కావాలని కోరారు.

READ ALSO: Harish Rao : స్కీంలు లేవుగానీ.. ఎందులో చూసినా స్కాంలు..!

నటి కియారా అడ్వాణీ, నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్ర తొలిసారి 2021లో విడుదలైన ‘షేర్షా’ సినిమా కోసం స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అదికాస్త కొంతకాలానికే ప్రేమగా మారడంతో ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో ఈ స్టార్ జోడీ 2023 ఫిబ్రవరి 7న పెళ్లి చేసుకున్నారు. ఇక సినిమాల పరంగా కియారా అడ్వాణీ తెలుగు తెరకు సుపరిచితమే. ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు, రామ్ చరణ్ సరసన కథానాయికగా నటించి ప్రేక్షకులను అలరించారు. ఇటీవల విడులైన వార్ -2లో కూడా కియారా అడ్వాణీ నటించారు. సిద్ధార్థ్ మల్హోత్ర సినిమాల విషయానికి వస్తే ఈ హీరో బాలీవుడ్‌లో తనదైన శైలిలో సినిమాలు చేస్తూ యూత్‌లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ఈ బాలీవుడ్ స్టార్ కపుల్ వారి పాప పేరును రివీల్ చేయడంతో వారి ఫ్యాన్స్ పుల్ ఖుషీ అవుతున్నారు.

READ ALSO: Tejas Fighter Jet: ‘తేజస్‌’కు సమస్యలు లేవు.. ప్రపంచానికి హెచ్‌సీఎల్ చీఫ్ స్పష్టమైన సందేశం