
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ చిత్రం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో కూడా భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ చిత్రాలతో తన మార్క్‌ను నిలబెట్టుకున్న సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను పవర్ఫుల్ కాప్ స్టోరీగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో హీరోయిన్గా త్రుప్తి దిమ్రిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ప్రత్యేకంగా రూపొందించిన సాంగ్ కోసం బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ హుమా ఖురేషిను తీసుకున్నారని తెలుస్తోంది. కేవలం స్పెషల్ సాంగ్‌కే కాకుండా హుమా సినిమాలో ఒక చిన్న పాత్రలో కూడా కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె పాత్ర సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ పాత్ర కథలో ఒక ట్విస్ట్ లేదా కీలక మలుపును సృష్టించే అవకాశం ఉందని టాక్.
Also Read : Trivikram Venkatesh 1 : త్రివిక్రమ్-వెంకీ మూవీ పై మరో ఇంట్రెస్టింగ్ టైటిల్ వైరల్..?
ఇక యూనిట్ రాబోయే షెడ్యూల్లో భారీ స్థాయి యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించడానికి రెడీ అవుతోంది. ఈ ఫైట్లు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. ముఖ్యంగా ఒక పెద్ద యాక్షన్ బ్లాక్ మొత్తం ‘స్పిరిట్’ కథనానికి టర్నింగ్ పాయింట్‌గా నిలవనుందని, ఆ సీన్లో ప్రభాస్ పవర్‌ని సందీప్ పూర్తిగా ఎలివేట్ చేయనున్నారట. మ్యూజిక్ విషయంలో కూడా టీమ్ ఏ మాత్రం రాజీ పడలేదు. ‘అనిమల్’కు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే హర్షవర్ధన్–సందీప్ రెడ్డి వంగా కలిసి అన్ని మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేసినట్లు సమాచారం. టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా మొత్తం మీద, ప్రభాస్–సందీప్ రెడ్డి కలయికలో వస్తున్న ‘స్పిరిట్’ ఇప్పటి నుంచే పాన్ ఇండియా ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తున్న భారీ ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది.