Spirit : స్పిరిట్ కోసం.. ప్రభాస్‌ విషయంలో షాకింగ్ డిసిషన్ తీసుకున్న సందీప్ రెడ్డి వంగా

Prabhas Sandeep Reddy Vanga Strict Decision For Spirit Look

ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తోన్న ‘స్పిరిట్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. అయితే సినిమా నుంచి ఏ చిన్న వివరమూ, ముఖ్యంగా ప్రభాస్ లుక్ లీక్ కాకుండా ఉండేందుకు దర్శకుడు సందీప్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. తదుపరి ఆరు నెలల వరకు ప్రభాస్ పబ్లిక్ ప్లేస్‌లలో కనిపించకూడదని వంగా కోరినట్లు తెలుస్తోంది. సినిమాలో ప్రభాస్ కొత్త లుక్ ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజ్ కావాలని సందీప్ భావిస్తున్నారని చెప్పుకుంటున్నారు. కానీ ప్రభాస్ ఎయిర్‌పోర్ట్‌గానీ, ఈవెంట్స్‌గానీ హాజరవుతే.. వారు ఎంత జాగ్రత్త పడిన, అభిమానులు ఆయన ఫోటోలు తీసి లీక్ చేస్తారన్న భావన వంగా టీమ్‌లో ఉందట. అందుకే షూటింగ్ పూర్తి అయ్యే వరకు హీరో బహిరంగ కార్యక్రమాలన్నింటినీ దూరంగా ఉండాలని ఇద్దరూ కలిసి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రభాస్‌ను రాబోయే కొన్ని నెలలు చూడలేకపోవడం అభిమానులకు కొద్దిగా నిరాశ కలిగించవచ్చేమో కానీ, వంగా రూపొందిస్తున్న ప్రత్యేక లుక్‌పై మాత్రం ఫ్యాన్స్ ఎక్స్‌ట్రీమ్‌గా ఎగ్జైటెడ్‌గా ఉన్నారు.