
బలగం సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. బలగం వచ్చి రెండుళ్లు పైనే అవుతున్న కూడా రెండవ సినిమాను స్టార్ట్ చేయలేదు ఈ దర్శకుడు. ఎల్లమ్మ అనేకథ రాసుకుని టాలీవుడ్ మొత్తం చుట్టేశాడు వేణు. మొదట నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తుంది అన్నారు. కానీ అక్కడ సెట్ కాలేదు. అక్కడి నుండి యంగ్ హీరో నితిన్ దగ్గరకి చేరింది. తమ్ముడు ఎఫెక్ట్ తో నితిన్ కూడా పక్కన పెట్టేసాడు. ఆ తర్వాత బెల్లంకొండ పేరు వినిపించింది. అది కార్యరూపం దాల్చలేదు.
Also Read : Spirit : షూట్ స్టార్ట్ కాకుండానే భారీ ధర పలికిన ‘స్పిరిట్’ డిజిటల్ రైట్స్
ఇక లేటెస్ట్ గా టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఎల్లమ్మ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని వార్తలు హల్ చల్ చేశాయి. ఈ వ్యాఖ్యలపై నిర్మాత దిల్ రాజు గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో మీడియాతో మాట్లాడుతూ’ ఎల్లమ్మ సినిమాలో హీరో ఫిక్స్ అయ్యాడు. త్వరలోనే అఫీషియల్ గా ప్రకటిస్తాం. అలగే ఎల్లమ్మ సినిమా హీరోయిన్ ఎవరనేది కూడా డిసెంబరులో క్లారిటీ ఇస్తాం. 2026 లో svc నుండి మొత్తం ఆరు సినిమాలు వస్తాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వెల్లడిస్తాం’ అని అన్నారు. గేమ్ చెంజార్ తో డీలా పడిన దిల్ రాజు బ్యానర్ బౌన్స్ బ్యాక్ అయేందుకు పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన సినిమా షూటింగ్ జరుగుతుండగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తో సంక్రాతికి వస్తున్నాం రీమేక్ చేసే ప్లాన్ లో ఉంది SVC, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోను ఓ భారీ యాక్షన్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు.