Tata Sierra Price: సెల్టోస్, క్రేటా, విక్టోరిస్‌తో పోల్చితే టాటా సియెర్రా ధర ఎక్కువా, తక్కువా.?

Tata Sierra Vs Rivals Price Comparison With Creta Seltos And Victoris More Affordable Or Premium

Tata Sierra Price: టాటా సియెర్రా (Tata Sierra) గురించి కార్ లవర్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఆకట్టుకునే డిజైన్, ఫీచర్లతో టాటా మోటార్స్ ఇప్పటికే, కార్ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. దీనికి తోడు ఆకర్షణీయమైన ధర, ఇతర కార్ మేకర్స్‌ ఛాలెంజ్ విసురుతోంది. మిడ్ సైజ్ ఎస్‌యూవీగా వస్తున్న సియెర్రా, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రేటా, మారుతి సుజుకి విక్టోరిస్‌కు పోటీగా ఉండబోతోంది. ప్రస్తుతం, సియెర్రా బేస్ మోడల్ ధరను రూ. 11.49 లక్షలు(ఎక్స్-షోరూం)గా నిర్ణయించారు. ఈ సెగ్మెంట్లో సియెర్రాను ప్రత్యర్థులతో పోలిస్తే, మెరుగైన ఫీచర్లు, ఇతర సాంకేతిక అంశాలు దీనిని ఒక మెట్టు పైనే ఉంచుతున్నాయి.

సియెర్రా ధర:

డిసెంబర్ 16, 2025 నుంచి దీని సియెర్రా బుకింగ్స్ ప్రారంభమవుతున్నాయి. డెలివరీలు జనవరి 15, 2026 నుంచి మొదలవుతున్నాయి. దీంట్లో స్మార్ట్ ప్లస్, ప్యూర్, ప్యూర్ ప్లస్, అడ్వెంచర్, అడ్వెంచర్ ప్లస్, అకంప్లిష్డ్ మరియు అకంప్లిష్డ్ ప్లస్ అనే 7 వేరియంట్లు లభిస్తాయి. అన్ని వేరింయట్ల ధరల్ని టాటా మోటార్స్ వెల్లడించనప్పటికీ, బేస్ మోడల్ ధర మాత్రం రూ. 11.49 లక్షలు(ఎక్స్ షోరూం) అని చెప్పింది.

కియా సెల్టోస్ ధర:

3

కియా సెల్టోస్ రూ. 10.80 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉంది. కియా సెల్టోస్ వేరియంట్ వారీగా ధరలు.

వేరియెంట్ల ధర (ఎక్స్-షోరూమ్)
HTE (O) రూ. 10,79,276
HTK రూ. 12,17,572
HTK (O) రూ. 12,57,068
HTK + (O) రూ. 13,92,898
HTK + రూ. 15,20,057
HTX రూ. 15,23,910
HTX (O) రూ. 16,15,427
GTX + రూ. 19,26,582
X-లైన్ రూ. 19,80,529

హ్యుందాయ్ క్రెటా ధర:

2

సెల్టోస్ లాగే క్రెటా కూడా 7 వేరియంట్లలో వస్తోంది. క్రెటా ఎక్స్-షోరూం ధరల్ని పరిశీలిస్తే.. పెట్రోల్ బేస్ E వేరియంట్‌కు ధర రూ. 10.72 లక్షల నుండి టాప్ ఎండ్ 1.5L టర్బో GDi పెట్రోల్ SX (O) డ్యూయల్ టోన్ DCT ధర రూ. 19.63 లక్షల వరకు ఉంది. డీజిల్ వేరియంట్లు బేస్ E మాన్యువల్ ధర రూ. 12.24 లక్షల నుండి ప్రారంభమై టాప్-స్పెక్ SX (O) నైట్ ఆటోమేటిక్ డ్యూయల్-టోన్ ఎడిషన్ ధర రూ. 20.19 లక్షల వరకు ఉంటుంది.

మారుతి సుజుకి విక్టోరిస్ ధర:

Maruti Suzuki Victoris

మారుతి సుజుకి ఇటీవల విడుదల చేసిన విక్టోరిస్ ఎస్‌యూవీ కూడా టాటా సియెర్రాకు పోటీగా ఉంది.

వేరియంట్ల వారీగా విక్టోరిస్ ధరలు:

1.5L NA స్మార్ట్ హైబ్రిడ్ (పెట్రోల్) – 5MT

LXi: రూ. 10,49,900
VXi: రూ. 11,79,900
ZXi: రూ. 13,56,900
ZXi(O): రూ. 14,07,900
ZXi+: రూ. 15,23,900
ZXi+ (O): రూ. 15,81,900

1.5L NA స్మార్ట్ హైబ్రిడ్ (పెట్రోల్) – 6AT

VXi: రూ. 13,35,900
ZXi: రూ. 15,12,900
ZXi (O): రూ. 15,63,900
ZXi+: రూ. 17,18,90
ZXi+ (O): రూ. 17,76,900

1.5L NA స్మార్ట్ హైబ్రిడ్ (పెట్రోల్) – AllGrip Select (6AT)

ZXi+: రూ. 18,63,900
ZXi+ (O): రూ 19,21,900

స్ట్రాంగ్ హైబ్రిడ్ (e-CVT)

VXi: రూ. 16,37,900
ZXi: రూ. 17,79,900
ZXi (O): రూ 18,38,900
ZXi+: రూ. 19,46,900
ZXi+ (O): రూ. 19,98,900

1.5L NA పెట్రోల్ S-CNG – 5MT

LXi: రూ. 11,49,900
VXi: రూ. 12,79,900
ZXi: రూ. 14,56,900