
Telangana Police Bust Delhi Drug Mafia: తెలంగాణ పోలీసులు మరోసారి మన్ననలు పొందారు. గ్రేట్ అని నిరూపించుకున్నారు. అక్కడ ఇక్కడ కాదు.. ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్ మాఫియాను అడ్డుకుని ప్రధాన నిందితుడు సహా అనేక మందిని అరెస్ట్ చేశారు. తాజాగా తెలంగాణ పోలీస్, ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీ జాయింట్ సీపీ మాట్లాడారు. డ్రగ్స్ సరాఫరా చేస్తున్న బ్యాచ్‌లో మొత్తం 10 మందిని అరెస్ట్ చేశాం.. తెలంగాణ ఈగల్ టీం ఏడు మందిని అరెస్ట్ చేసింది. డ్రగ్స్ సరఫరాలో మాస్టర్ మైండ్‌ను అరెస్ట్ చేశాం.. ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా తెలంగాణకు డ్రగ్స్ సరఫరా జరుగుతుంది.. రూ. 12 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పట్టుకున్నాం.” అని తెలిపారు.
READ MORE: Rahul Gandhi: ‘ఢిల్లీ పొల్యూషన్’పై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. రాహుల్‌గాంధీ డిమాండ్
అనంతరం.. తెలంగాణ ఎస్పీ సీతారాం మీడియా సమావేశంలో మాట్లాడారు. “తెలంగాణలో ఒక రెస్టారెంట్లో డ్రగ్స్ వాడకం గుర్తించాం.. వాళ్లకు కొరియర్‌లో డ్రగ్స్ వస్తున్నాయి.. నైజీరియన్లు ఇందులో ఉన్నారు.. నెట్వర్క్ లో ఎవరెవరు ఉన్నారో గుర్తించాం.. ఢిల్లీలో రెక్కీ నిర్వహించాం.. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ తో కలిసి ప్లాన్ చేశాం.. వాళ్ళు సహకరించారు.. 105 తెలంగాణ, ఢిల్లీ 80 మంది పోలీసులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు.. 100 శాతం మా ఆపరేషన్ సక్సెస్ అయింది.. నిందితులు ప్రతి రోజు 1975 మందికి తెలంగాణలో డ్రగ్స్ సప్లై చేస్తున్నారు.. ” అని వెల్లడించారు.
READ MORE: Bollywood : భారీ రన్ టైమ్ తో రిలీజ్ కాబోతున్న బాలీవుడ్ బిగ్ సినిమా