
టాలీవుడ్ నటుడు మరియు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ డిరెక్టన్ లో నేషనల్ క్రష్ రష్మిక లీడ్ రోల్ లో వచ్చిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. నవంబరు 7న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకొడవమే కాదు ఫైనల్ రన్ లో వరల్డ్ వైడ్ గా రూ. 30 కోట్ల గ్రాస్‌ను రాబట్టి కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. ముఖ్యంగా రష్మిక పర్ఫామెన్స్ కు ఆడియన్స్ నుండి మంచి ప్రశంసలు లభించాయి.
Also Read : SVC : ఎల్లమ్మ సినిమాలో హీరోను కన్ఫమ్ చేసిన దిల్ రాజు
థియేటర్ లో సూపర్ హిట్ అయి గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్న నెట్ ఫ్లెక్స్ తాజాగా స్ట్రీమింగ్ డేట్ కు అనౌన్స్ చేసింది. ఈ డిసెంబర్ 5వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నట్టు ప్రకటించింది. తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తుంది నెట్ ఫ్లిక్స్. రెగ్యులర్ గా అన్ని సినిమాల మాదిరి థియేటర్ లో రిలీజ్ అయిన నాలుగు వారల థియేట్రికల్ విండో స్టాండర్డ్ మోడల్ ప్రకారం 28 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేస్తుంది నెట్ ఫ్లిక్స్. థియేట్రికల్‌గా సూపర్ హిట్ అయిన ఈ సినిమా, నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.